Hardik: భార్యతో కలిసి హార్ధిక్ చేసిన డ్యాన్స్ చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Hardik: టీమిండియాలోని చురుకైన క్రికెటర్లలో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఒకరు. ఆటతోపాటు యాక్టింగ్, డ్యాన్సింగ్, యాంకరింగ్.. ఇలా ఏదైనాసరే దుమ్ము దులిపేస్తాడు. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, ఇషాన్ కిషాన్‌లతో కలిసి హార్ధిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియో విపరీతంగా వైరలైంది. తాజాగా మరో వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

భార్యలా చేయలేక..
హార్ధిక్ పాండ్యాకు అతడి భార్య నటాషా స్టెప్పులు నేర్పిస్తూ కనిపించింది. ‘వన్.. టూ.. త్రీ.. ఫోర్’ అని నంబర్స్ చెబుతూ నెమ్మదిగా స్టెప్పులు నేర్పించింది. కానీ హార్ధిక్ మాత్రం ఆమెలా చేయలేకపోయాడు. స్వతహాగా నటి అయిన నటాషా.. చాలా సింపుల్ గా స్టెప్పులు వేసింది. అలవాటు లేని పనికావడంతో హార్ధిక్, ఆమెలా చేయలేకపోయాడు. తనకు వచ్చినట్లు చేతులు, కాళ్లు కదిపాడు. ఈ మొత్తం ప్రొసెస్‌ని వీడియోగా తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

కాగా, ఇటీవలే కివీస్‌తో టీ20 సిరీస్‌ను కెప్టెన్‌గా గెలిపించాడు హార్ధిక్. ఆ తర్వాత కివీస్‌తో వన్డేలు, బంగ్లాదేశ్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు మేనేజ్‌మెంట్ రెస్టు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన హార్ధిక్ పాండ్య.. కొన్నిరోజుల్లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ క్రమంలో సెర్బియన్ నటి నటాషాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అగస్త్య అనే కొడుకు ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కప్ కూడా కొట్టాడు. త్వరలో టీమిండియా టీ20 జట్టకు పూర్తిస్థాయి కెప్టెన్ అవుతాడనే టాక్ కూడా వినిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts