Allu Arjun: అల్లు అర్జున్ ఏకంగా ఆ రేంజ్ లో ఆస్తులు సంపాదించాడా?

Allu Arjun: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటు పాన్ ఇండియా హీరోగా మారాడు. కాగా 2021లో విడుదల అయినా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతే కాకుండా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది.

కాగా అల్లు అర్జున్ తెలుగులో దేశముదురు, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. కాగా మొదటి సినిమా గంగోత్రికి 5లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో మూవీకి 36కోట్లు అందుకున్నాడు. ఇక పుష్ప పాన్ ఇండియా మూవీకి 40కోట్లు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

 

అదేమిటంటే ప్రస్తుతం ఒక సినిమాకు 40 నుంచి 45 కోట్ల వరకు రెమినరేషన్ అందుకుంటున్న అల్లు అర్జున్ కి దాదాపు 400 కోట్ల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డునెంబర్ 45లో 15కోట్ల విలువచేసే అధునాతన సౌకర్యాలతో ఇల్లు ఉంది. 8కార్లు,అన్ని సౌకర్యాలతో ఏడున్నర కోట్ల విలువ చేసే కార్వాన్ ఉన్నాయి. మరో కొత్త ఇల్లు కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా లగ్జరీ బ్యాండ్లు కలిగిన స్మార్ట్ వాచ్ లు కూడా ఉన్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత నెల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ టీజర్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -