Bigg Boss: బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా మంచు విష్ణు అంగీకరించారా?

Bigg Boss: తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ, తమిళ బిగ్ బాస్ షోల మాదిరిగానే తెలుగులోనూ ఈ షో ఎంతో పెద్ద హిట్టయ్యింది. ప్రతి ఏడాది ఒక్కో సీజన్ తో బుల్లితెర ఆడియెన్స్ కు మస్తు మజాను పంచుతోంది. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి.

 

తెలుగులో బిగ్ బాస్ షోకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జునలు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వీళ్ల హోస్టింగ్ షోకు ఎంతో క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున విషయంలో బుల్లితెర ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

తర్వాతి హోస్ట్ ఎవరు..?
బిగ్ బాస్ షోను నాగ్ అంతగా రక్తికట్టించలేకపోతున్నారంటూ సోషల్ మీడియాలోనూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కంటెస్టెంట్లను ఎడాపెడా, అనవసరంగా తొలగిస్తూ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు నాగార్జునను హర్ట్ చేశాయట. దీంతో ఆయన షో హోస్టింగ్ నుంచి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో షోకు తదుపరి వ్యాఖ్యాత ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నందమూరి నటసింహం బాలకృష్ణతోపాటు హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి పేర్లు హోస్టింగ్ పేర్లలో వినిపించాయి. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

 

తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 7కు యంగ్ హీరో మంచు విష్ణు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారట. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ ఆయన్ను సంప్రదించిందట. ఈ ఆఫర్ కు ఆయన కూడా సానుకూలతను తెలియజేసినట్లు వినికిడి, ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే సంచలనమనే చెప్పాలి. మరి, హోస్ట్ గా విష్ణు ఎలా మెప్పిస్తారనేది చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -