Pushpa 2: పుష్ప2 మూవీకి ఏకంగా వెయ్యి కోట్ల రేంజ్ ఆఫర్ వచ్చిందా?

Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఎంతలా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుందో చూసాం. భారీ వసూలుతో ఈ సినిమా ఓ రేంజ్ లో సందడి చేసింది. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర భాషకు చెందిన ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో నచ్చిందని చెప్పవచ్చు. ఇక ఇందులో వచ్చిన ప్రతి పాటకు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.

 

ఇక ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ట్రెండ్ గానే ఉన్నాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా పార్ట్ 2 గా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ఏకంగా 1000కోట్ల రేంజ్ ఆఫర్ వచ్చిందని తెలియడంతో అందరి మైండ్ బ్లాక్ అవుతుంది.

అయితే ఈ సినిమా పార్ట్ వన్ ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూశాం. దీంతో అల్లు అర్జున్ కి కూడా ఈ సినిమా బాగా కలిసి రావడంతో ఆయన పారితోషకం కూడా రూ.100 కోట్లకి చేరిందని తెలిసింది. ఆ తర్వాత వచ్చే సినిమాలకన్నీ ఆయన ఇంతే పారితోషకం తీసుకుంటాడని తెలిసింది. అయితే తాజాగా పుష్ప2 కు జీ వాళ్ళు బడా ఆఫర్ ఇచ్చారు.

 

జీ వాళ్లు ఈ సినిమాకు అన్ని హక్కులు కలిపి రూ. 900 కోట్లు ఇస్తామని అన్నారట. అయితే సినీ నిర్మాతలు
మైత్రి మూవీ మేకర్స్ మాత్రం అంత చాలదు అన్నట్లు రూ.1050 కోట్లు అడుగుతున్నట్లు తెలిసింది. మామూలుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందుకే ఇంత ఆఫర్ రావటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆఫర్లు అన్ని భాషల ఓటీటీ, శాటిలైట్ హక్కులు ఉన్నాయని తెలిసింది. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -