Rashmika: సమంత మరిది విషయంలో రష్మిక అలా వ్యవహరించారా?

Rashmika: తెలుగు సినీ చరిత్రలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో సినీ ఇండస్ట్రీని ఏలాడు. ఆయన తర్వాత నాగార్జున తన హవాను కొనసాగిస్తున్నారు. కానీ ఆయన తర్వాత ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్‌ మాత్రం దారుణంగా పడిపోయారనే చెప్పాలి. వీరిద్దరూ ఎన్ని సినిమాలు చేసినా స్టార్ హీరోలుగా మాత్రం రాణించలేకపోతున్నారు. అంతో ఇంతో నాగచైతన్యన కాస్త బెటర్‌ అనిపించుకుని కొన్ని సినిమాలతో దూసుకుపోతున్నాడు.

 

అయితే అఖిల్ మాత్రం దారుణంగా పడిపోతున్నాడు. ఆయన కెరీర్‌ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా మాత్రమే విజయం సాధించింది. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్‌ మొత్తం పూజాహెగ్డే ఖాతాకే వెళ్లిపోయిందని చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌ లో గతేడాది అక్టోబర్ 15న గ్రాండ్‌ గా ఈ సినిమా విడుదలై విజయం సాధించింది.

ఈ సినిమాకు ముందుగా రష్మికను అందులో హీరోయిన్ గా అనుకున్నట్లు తెలుస్తోంది. భాస్కర్ ఆమెను హీరోయిన్ గా అనుకుని రష్మిక వద్దకు వెళ్లి అడగ్గా ఆమె ముఖం మీదనే రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. అందుకు కారణం ఏంటని అడిగితే అఖిల్‌ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా హిట్‌ కొట్టలేదని చెప్పిందట. అఖిల్ తో సినిమా చేస్తే తన కెరీర్ కూడా డౌన్ అవుతుందని ఆలోచించి రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

 

రష్మిక అంత మాట అనడంతో బొమ్మరిల్లు భాస్కర్‌ కూడా ఏం మాట్లాడకుండా పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నాడట. ఇకపోతే పూజాను తీసుకున్న తర్వాత ఆమె ఈ సినిమాలో బాగా నటించింది. ఆ పాత్రలో రష్మికను ఊహించుకోలేమని పలువురు అంటున్నారు. రష్మిక ఈ సినిమా చేయకుండా ఉన్నదే బెటర్‌ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -