Ravi teja: రావణాసుర సినిమా అక్కడ మాత్రం సక్సెస్ సాధించిందా?

Ravi teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు రవితేజ. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న రవితేజ ఆ తర్వాత ధమాకా సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ఇటీవల రవితేజ రావణాసుర సినిమాతో ప్రేక్షకులను పరిగణించిన విషయం తెలిసిందే.

గత నెల ఏప్రిల్ ఏడవ తేది విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అయింది అన్న విషయం కూడా చాలామంది అభిమానులకు గుర్తులేదు. ఈ సినిమా విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేసింది. రావణాసుర సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ లో నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్న రావణాసుర సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన 24 గంటల్లోనే ఇండియా టాప్ 2లోకి వచ్చేసింది. వీకెండ్ కూడా కావటం సమ్మర్ హాలిడేస్ అందులోనూ రవితేజ కొత్త సినిమా కావటంతో ఇళ్లల్లోనే సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.

 

50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిమితమైన రావణాసుర సినిమా క్రైం అండ్ యాక్షన్ ట్విస్టులతో తెరకెక్కిన సంగతి తెలిసిందే. కానీ థియేటర్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీలోకి రిలీజ్ చేశారు. ఊహించని విధంగా ఆన్ లైన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను ప్రేక్షకులు తెగ వీక్షించేస్తున్నారు. మరో 24 గంటల్లో ఇండియా నెంబర్ వన్ లోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు అభిమానులు. ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు, సిరీస్ లు లేకపోవటంతో మరో వారం రోజులు రావణాసుర సినిమాకీ మంచి వ్యూవర్ షిప్ దక్కే అవకాశాలు లేకపోలేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తమిళ భాషలోనూ రావణాసుర మూవీ అందుబాటులో ఉండటంతో మంచి వ్యూవర్ షిప్ వస్తోంది. థియేటర్లో నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ లో మాత్రం అత్యధిక స్థాయిలో వ్యూస్ ని రాబడుతూ దూసుకుపోతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -