Yashoda: యశోద మూవీతో ప్రేక్షకులను ఇంత మోసం చేశారా?

Yashoda: టాలీవుడ్ లో తన నటనతో అందరినీ ఆకట్టుకునే హీరోయిన్ల జాబితాలో సమంత ఖచ్చితంగా టాప్ లో ఉంటుంది. ‘ఏమాయ చేసావె’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత.. ఒక్కొక్క సినిమా అద్భుతంగా చేసుకుంటూ ఇప్పుడు తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకుంది. తెలుగులో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసే అతి కొద్దిమంది హీరోయిన్ల జాబితాలో సమంత కూడా ఒకరు.

సమంత తాజాగా నటించిన ‘యశోద’ సినిమా శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సరోగసి నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ స్టోరీకి సమంత ప్రాణం పోసిందని, సమంత కోసం సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు అనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులే కాదు.. తమిళ, హిందీ, ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది.

సమంత నటించిన ‘యశోద’ సినిమా స్టోరీని కొంతమంది పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ సినిమాతో పోలుస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒకటి కామన గా ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకే ‘యశోద’ కథ రాసుకునేటప్పుడు ‘పోకిరి’ని గుర్తుచేసుకొని రాసి ఉంటాడు అనే టాక్ నడుస్తోంది. అయినా గానీ పోకిరి నుండి తీసుకున్న ఈ పాయింట్ బాగానే వర్కవుట్ అయిందని అందరూ అంటున్నారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

మహేష్ బాబు చేసిన ‘పోకిరి’ సినిమాలో క్లైమాక్స్ కి ముందు వచ్చే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో మహేష్ బాబును అప్పటి వరకు పోకిరిగా చూపించి.. ఒక్క సీన్ లో అతడు పోలీస్ ట్రెయినింగ్ తీసుకున్న అండర్ కవర్ కాప్ అని రివీల్ చేసే సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సమంత తాజాగా చేసిన ‘యశోద’ సినిమాలో కూడా సమంత పోలీస్ ట్రెయినింగ్ తీసుకున్నట్లు చూపించడంతో.. పోకిరి నుండే ఈ ఐడియాను కాపీ చేశారని అందరూ అంటున్నారు. మొత్తానికి కాపీ చేసినా జనాలకు మాత్రం సమంత సినిమా బాగా నచ్చింది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts