Mohan Babu: ఆ హీరోయిన్‌కు ఆఫర్లు తగ్గడానికి మోహన్ బాబు మూవీనే కారణమా?

సాధారణంగా హీరోయిన్లు అంటే స్లిమ్‌గా ఉంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఛబ్బీగా ఉంటూ తన అందచెందాలతో కుర్రకారులను ఆకట్టుకుంది. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించి కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. స్టార్ హీరోయిన్ ఛార్మి.

 

ఈ పంజాబీ భామ పదిహేనేళ్ల వయస్సులోనే చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. ఛార్మి ‘నీ తోడుకావాలి’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా థియేటర్‌లో ఎప్పుడు రిలీజ్ అయిందో?.. ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలీదు. ఛార్మి మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సంవత్సర కాలంలోనే ఛార్మి నాలుగు భాషల్లో నటించింది. సినిమాతో సంబంధం లేకుండా హీరోయిన్ ముద్దుగా ఉండటంతో ఆమెకు వరుస అవకాశాలను అందుకుంది.

 

శ్రీకాంత్ హీరోగా ‘నీకే మనసిచ్చాను’ సినిమాలో హీరోయిన్‌గా ఛార్మి మరో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. నితిన్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమాలో నటనకు ఛార్మి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో కలిసి ‘మాస్’ సినిమాలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్ ఛార్మి ఇండస్ట్రీకి దూరమైంది.

 

అయితే ఛార్మి ఇండస్ట్రీకి దూరం కావడానికి మోహన్ బాబునే కారణమని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. మోహన్ బాబు హీరోగా ‘పొలిటికల్ రౌడీ’ సినిమాలో నటించడం కారణంగానే ఆమెకి అవకాశాలు తగ్గి ఇండస్ట్రీకి దూరమైందని ఫుకార్లు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఛార్మి సినిమాలకు విరామం ఇచ్చింది. ఇండస్ట్రీకి దూరమైన ఈ భామ ప్రొడ్యూసర్‌గా అవతారం ఎత్తింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’, విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -