Tollywood: అయ్యో.. ఈ టాలీవుడ్ యాంకర్ అలాంటి పాత్రలలో నటించిందా?

Tollywood: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలంటే చాలా టాలెంట్ ఉండాలి. బ్యాగ్రౌండ్ తో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. బ్యాగ్రౌండ్ అదృష్టం లేకుండా టాలెంట్ ఉన్నా ఆఫర్లు అంతగా రావనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో కుదురుకోవాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి వస్తుంది. అయితే చాలా మంది సినిమాల‌పై ఉన్న ఇష్టంతో ఏ పాత్రలు అయినా చేసేస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టాలను భరిస్తూ ఉంటారు.

అలా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి మొద‌ట సైడ్ డ్యాన‌ర్స్ గా కెరీర్ ప్రారంభించి ప్ర‌స్తుతం యాంక‌ర్ గా న‌టిగా రానిస్తున్న బ్యూటీ భాను శ్రీ గురించి అందరికీ తెలిసిందే. మొద‌ట ఈమె సైడ్ డ్యాన్స‌ర్ గా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత మిర్చి సినిమాలో అనుష్క పక్కన డ్యాన్సర్ గా మెరిసింది. డార్లింగే ఓసినా డార్లింగే పాట‌లో సైడ్ డ్యాన్స‌ర్ గా కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సీరియళ్లలో నటించింది.

ఆ తర్వాత భానుశ్రీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాక అక్కడ కూడా తన ప్రతిభను చూపించింది. త‌న ముక్కు సూటి తనంతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తర్వాత చాలా సినిమా ఆఫర్లను ఆమె అందుకుంది. ఆ తర్వాత ఈమె బుల్లితెరపై పలు షోలలో మెరిసింది.

యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప‌లు టీవీ షోల‌లో భాను శ్రీ కనిపించింది. ప్ర‌స్తుతం ఆమె యాంక‌ర్ గా కొనసాగుతోంది. నటిగా కూడా కొన్ని సినిమాల్లో చేస్తోంది. ఇండ‌స్ట్రీలో భాను శ్రీ మాదిరిగా ఎదిగిన వాళ్లు చాలా త‌క్కువ మంది ఉండటం విశేషం. రియల్ లైఫ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో ఆమెకంటూ ప్రత్యేకత సొంతం చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -