Hassan: ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. సీన్ కట్ చేస్తే ఇద్దరు రక్తపుమడుగులో అలా?

Hassan: నేటి సమాజంలో యువత ప్రేమ అనే రెండు అక్షరాల మోజులో పడి చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ప్రేమ అన్న మోజులో పడి తప్పటడుగులు వేస్తూ ఆకర్షణకు పోయి ఆత్మహత్యలు చేసుకోవడం హత్యలు చేయడం వరకు వెళ్తున్నారు. కొందరు ప్రేమించిన యువతి కాదని హత్య చేస్తే, మరికొందరు ప్రేమించిన యువతి నో చెప్పిందని ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అంతేకాకుండా ప్రేమికులు చిన్నచిన్న వాటికే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కూడా ఒక ప్రేమికుడు తన ప్రియురాలు తనతో పాటు రాను అన్నందుకు ఏకంగా ప్రియురాలిని చంపడానికి ఒడిగట్టాడు.

 

తాజాగా ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. కర్ణాటక, చిక్కబల్లాపూర్‌ జిల్లాలోని చింతామణికి చెందిన మంజునాథ అనే యువకుడు టిక్‌ టాక్‌లో రీల్స్‌ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అతడికి హొసకోటెకు చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో సోషల్‌ మీడియా ద్వారా ఇద్దరూ చాటింగ్‌ చేసుకుంటూ ఉండేవారు. ఇటీవల కొద్దీ రోజుల క్రితం అతడు ప్రియురాలి ఇంటికి వచ్చి ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. అనంతరం తనతో పాటు సరదాగా బయట తిరగటానికి రమ్మని ఆమెను పిలవగా అందుకు ఆ యువతీ నిరాకరించింది. దాంతో మంజునాథ్ కి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే అతడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.

 

గొంతు భాగంలో కత్తితో పొడిచాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడడంతో అక్కడే కుప్పకూలింది. అనంతరం మంజునాథ్ కూడా తనను తాను కత్తితో పీక కోసుకున్నాడు. అలా ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు. యువతి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక స్థానికుల సమాచారం మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానీకి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆరోగ్యం బాగైన తర్వాత అతడ్ని అరెస్ట్‌ చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు..

 

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -