Majalgoan: ఈ తల్లీదండ్రులు చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Majalgoan: సాధారణంగా తల్లి తండ్రులు తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తూ ఉంటారు. ఇంకొందరు బాగా డబ్బు ఉన్నవారు పిల్లలు అడిగిందల్లా తీసి ఇచ్చి వారిని చదవకుండా సోమరిపోతుల్లా తయారు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న ప్రధాన తప్పు అదే అని చెప్పవచ్చు. మామూలుగా ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయ్యారు అని తెలిస్తే కొందరు తల్లిదండ్రులు మాటలతో తిడితే మరి కొందరుకొడుతూ ఉంటారు.. ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లలకు దైర్యం చెప్పి మరొకసారి పరీక్షల్లో రాసి పాస్ అవ్వమంటూ ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు.

కాగా చదువుల్లో ఉండే ఒత్తిడి కారణంగానే ఏటా వందల మంది విద్యార్థులు సూసైడ్స్‌ చేసుకుంటున్నారు. కొందరు ఫెయిల్ అయ్యామని తల్లిదండ్రులకు తెలిస్తే ఏమైనా అంటారేమో అన్న భయంతో ముందుగానే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో చోటు చేసుకున్నాయి. కానీ తాజాజా మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన అందుకు పూర్తిగా విరుద్ధం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ వీడియోని చూస్తే ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అన్న అనుమానం రాక మానదు. అసలేం జరిగిందంటే..

 

మహారాష్ట్ర లోని బీడ్‌లోని మజల్‌గావ్ తహసీల్‌లోని రామేశ్వర్ విద్యాలయట్ ఉమ్రీ విద్యార్థి ధనంజయ్ నఖాటే అనే 14 ఏళ్ళ వ్యక్తి ఇటీవలే పదవ తరగతి పరీక్షలు రాసాడు. తాజాగా ఈ పరీక్ష ఫలితాలు వచ్చాయి. ధనంజయ్ నఖాటే మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్సెస్‌లలో ఒక్కొక్క సబ్జెక్ట్ లో 35 మార్కులు తెచ్చుకున్నారని వ్యవసాయ కూలీ అయిన అతని తండ్రి నారాయణ్ తెలిపారు. ధనంజయ్ స్కూల్‌ కి తరచుగా వెళ్ళేవాడని,తనతోపాటు పనులకు కూడా వచ్చేవాడని, మధ్యలో సమయం దొరికినప్పుడల్లా చదువుకోవడానికి ప్రయత్నించేవాడని నారాయణ్ తెలిపారు. ఈ ఫలితం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని తన కొడుకులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ధనంజయ్ సంతోషంతో మాట్లాడుతూ ఇంకా చదవాలని నేను కోరుకుంటున్నాను. మా నాన్న అందుకు అంగీకరిస్తే, ఉమ్రీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజల్‌గావ్‌లోని జూనియర్ కళాశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తాను అని తెలిపారు. ధనంజయ్‌ ఫలితాలు రాగానే గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. బాలుడికి ఇద్దరు పెద్ద తోబుట్టువులు ఉన్నారు. వారిలో ఒకరు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారు, మరొకరు 11వ తరగతి తర్వాత చదువును విడిచిపెట్టారు. అయితే మార్కుల కోసం తల్లిదండ్రులే పిల్లల్ని వేధిస్తున్న ప్రస్తుత సమాజంలో ధనంజయ్ తల్లిదండ్రులు అతడి విజయ సంబరాలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఈ వీడియోని చూసి తల్లిదండ్రులు ఇన్స్పైర్ అవ్వాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

 

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -