Balayya: ఫ్యాన్స్ ను కొట్టడంపై బాలయ్య షాకింగ్ కామెంట్స్ విన్నారా?

Balayya: నందమూరి బాలకృష్ణకు తెలుగు నాట ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో సఫలమయ్యారు. బాలకృష్ణ చేసే ప్రతి చిన్న విషయం అతని అభిమానులకు పెద్ద చర్చనీయాంశంగా ఉంటుంది.

 

బాలయ్య సినిమాల్లో ఎంత గంభీరంగా ఉంటాడో కొన్ని సందర్భాల్లో నిజజీవితంలో కూడా అలాగే ఉంటారు. పలు సందర్భాలలో ఆయన అభిమానులను కొట్టడం వాళ్ళ ఫోన్లు విసిరేయడం వంటివి చేశారు. జనాల్లోకి వెళ్ళినప్పుడు అభిమానులు ఆయనతో చేయగలపడానికి మీదపడడం వంటివి చేసినప్పుడు బాలయ్య సహనం కోల్పోయి చాలా సార్లు కొట్టడం జరిగింది. కానీ బాలయ్య అభిమానులకు ఆయన కొట్టిన , తిట్టినా ఏం చేసినా సంతోషమే కలుగుతుంది తప్ప బాధ కలగదట.

 

బాలకృష్ణ ఒక సందర్భంలో ఈ విషయంపై మాట్లాడుతూ…తన కొట్టిన తన అభిమానులు పట్టించుకోరని. తన చేయి తాకిందని సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పారు. ఈ విషయం గురించే పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. బాలయ్య కు బౌసర్లతో పనిలేదు. ఆయన తన అభిమానంతో అదుపు చేసుకుంటారు అని అన్నారు.

 

అయితే రీసెంట్ గా స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ అభిమానులను కొట్టడం గురించి ఆయన దగ్గర ప్రస్తావించానని. దానికి ఆయన ఇచ్చిన జవాబు చూసి నిజంగా షాక్ అయ్యాను అని వెల్లడించారు. మామూలుగా కొంతమంది హీరోలు అభిమానుల నుంచి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి బంసర్లను పెట్టుకుంటారు. వారు అదుపుతప్పిన , మీదకొచ్చిన వెనక్కి నెట్టడానికి ఈ బౌన్సర్లు ఉపయోగపడతారు. కానీ నా అభిమానులను కొట్టడానికి బౌన్సర్లు ఎవరు. వాళ్లని కొడితే నేనే కొట్టాలి…అని బాలయ్య అనడం తో సాయి మాధవ్ షాక్ అయ్యాడంట.

 

తనకు తన అభిమానులకు మధ్య ఎవరూ ఉండకూడదు అని బాలయ్య అభిప్రాయం. వాళ్లు తనకు కుటుంబంతో సమానం, వాళ్లలో ఎవరైనా తప్పు చేస్తే కొట్టే హక్కు తనకు మాత్రమే ఉంది. అలా చేయడం లో తప్పు ఏమీ లేదనేది బాలయ్య ఉద్దేశం. బాలకృష్ణ ఉద్దేశం ఆయనకు ఎంతో నచ్చిందని సాయి మాధవ్ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -