Unstoppable: అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ పై నెటిజన్ల కామెంట్లు విన్నారా?

Unstoppable: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రభాస్ ఎపిసోడ్ ఆహా లో వచ్చేసింది. షోస్ కి దూరంగా ఉండే ప్రభాస్ మొదటిసారి షో కి రావడంతో దీనికి ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైనే ఇండస్ట్రీలో ఉన్నా కూడా ప్రభాస్ ఎలాంటి టాక్ షోస్ కి వెళ్ళిన సందర్భం లేదు. బాహుబలి పుణ్యమా అని మీడియాతో బాగానే మాట్లాడాడు యంగ్ రెబల్ స్టార్.

 

సాహో నిర్మించింది తన మిత్రుడు, సోదరుడు కాబట్టి ఆ సినిమా ప్రమోషన్స్ తన భుజాన వేసుకున్నాడు. దీంతో మీడియా ప్రమోషన్స్ అంతా ప్రభాస్ మాత్రమే చేశాడు శ్రద్ధా కపూర్ తో కలిసి. అలాంటి ప్రభాస్ ఆహా షో కి వచ్చాడంటే అర్ధం చేసుకోవచ్చు అభిమానుల్లో ఎలాంటి క్రేజ్ ఈ షో కి ఉందో.

 

ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల ఆహా ఆప్ క్రాష్ అయ్యింది. అయితే అంతగా ఎదురుచూసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది అనే మాట వినిపిస్తుంది అభిమానుల నుంచి. తమ అంచనాలకు తగ్గట్టుగా లేదు అంటున్నారు. మొదటి భాగంలో అంతగా ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు అభిమానులు. బాలయ్య బాబు అడిగిన ప్రశ్నల మీద కూడా మిశ్రమ స్పందన లభిస్తుంది అభిమానుల నుంచి. డేటింగ్ రూమర్స్ గురించి ప్రశ్న సంధించిన నందమూరి నట సింహం కృతి సనన్ మీదనే సాగతీయడం అభిమానులకి నచ్చలేదు. హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది కదా అని ప్రభాస్ చెప్పినా బాలకృష్ణ వినలేదు.

 

ఈ షో కి ఇచ్చిన పబ్లిసిటీ వచ్చిన క్రేజ్ అభిమానాలు అంచనాలను పెంచేసింది. బాహుబలి లాంటి ఎపిసోడ్ వస్తుంది అనుకుంటే రాధే శ్యామ్ తో సరిపెట్టారు అంటున్నారు. రాధే శ్యామ్ మాదిరే తన పామిస్టు పాత్ర పోషించారు. బాలకృష్ణ చేతిని చూసి మీరు ఇంకొక పది సంవత్సరాలు అన్ స్టాపబుల్ అంటాడు. అయితే ఇది మొదటి భాగం మాత్రమే. రెండవ భాగంలో గోపీచంద్ ఉంటాడు కాబట్టి ఆ ఎపిసోడ్ కొద్దిగా ఫన్ అందించే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -