Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానుల కామెంట్లు మీరు విన్నారా?

Pawan Kalyan: దాదాపు మూడు సంవత్సరాల క్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తిరిగి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వకీల్ సాబ్ మూవీతో షాకింగ్ రీతిలో రియల్ ఇచ్చిన పవన్ ఇప్పటికీ తన ఫాన్ ఫాలోయింగ్ తగ్గలేదు అని నిరూపించుకున్నారు. వకీల్ సాబ్ బాలీవుడ్ మూవీ పింక్ ఆధారంగా తెరకెక్కిన తెలుగు రీమేక్ చిత్రం.

 

తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఓ రకంగా రీమేక్ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు అన్న అనుమానం అతని అభిమానుల్లో రేకెత్తుతోంది. ఎందుకంటే ఇటీవల రిలీజ్ అయిన భీమ్లా నాయక్ చిత్రం కూడా మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యపనుం కోశ్యం అనే మూవీకి రీమేక్. ఈ చిత్రానికి దర్శకత్వం సాగర్ చంద్ర వహించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు.

 

ఈ సినిమా తరువాత రాబోతున్న పవన్ నెక్స్ట్ మూవీ కూడా ఇంకో రీమేక్ సినిమా అనే న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ మరియు హరిశంకర్ కాంబోలో మూవీ అప్డేట్ రిలీజ్ అవ్వడంతో ఫాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే రాబోతున్న ఆ మూవీ విజయ్ పోలీసోడు మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. ఆ మూవీ రిలీజ్ అయి ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తుంది పైగా అది తెలుగులో కూడా డబ్బు అవడంతో ఇప్పటికే అందరూ దాన్ని ఎన్నోసార్లు చూసేసారు.

 

ఈ విషయం తెలిసినప్పటి నుంచి పవన్ అభిమానులు కావాలంటే అజ్ఞాతవాసి 2 తీయండి చూస్తాం కానీ ఈ సినిమా మేము చూడమని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో నుంచి ఇటువంటిది ఆశించడం లేదని ఈ వార్త తమకు నిరాశ కలిగించిందని అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -