Tarak: తారక్ కు ఆస్కార్ గురించి ఫ్యాన్స్ కామెంట్స్ మీకు విన్నారా?

Tarak: టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజే వేరు. తాజాగా ఆర్ఆర్ఆర్ లో అద్భుతమైన నటనతో మెప్పించిన తారక్ కు ఆస్కార్ అవార్డు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దర్శక ధీరుడు అయిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి ఆస్కార్ కచ్చితంగా వస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో రికార్డులను సాధించింది.

 

ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటనకు గాను ఆయన ఆస్కార్‌ అవార్డ్ రేసులో నిలిచాడా? అని గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పలు రికార్డులను సాధించింది. ఈ సినిమాలో తారక్ కొమురం భీంగా, మరో అగ్ర హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు.

దేశవ్యాప్తంగా థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదలై విదేశాల్లోని ప్రేక్షకులకు సైతం చేరువైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటనకుగాను దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ అందుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని తారక్ ఈ సినిమాలో మెప్పించారు.

 

ఈ క్రమంలో అమెరికాలో పేరొందిన ‘వెరైటీ’ అనే వెబ్ సైట్ లో 2023 ఆస్కార్‌ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్-ప్రెడిక్షన్ జాబితా ప్రకారంగా చూస్తే 2023 ఆస్కార్‌ బరిలో జూనియర్ ఎన్టీఆర్‌ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వార్తతో ఎన్టీఆర్‌ అభిమానుల్లో సందడి మొదలైంది. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చినా తప్పు లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్ ఆస్కార్ కు అర్హుడని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. మరి ఫ్యాన్స్ కోరుకున్న ప్రకారం తారక్ కు ఆస్కార్ వస్తుందేమో చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -