Maryada Ramanna: రాజమౌళి-సునీల్ కాంబినేషన్‌లోని సినిమాలో మిస్టేక్స్ చూశారా?

Maryada Ramanna: సినీ ఇండస్ట్రీలో సినిమాను తెరకెక్కించేటప్పుడు నటనతో పాటుగా గ్రాఫిక్స్ తో కల్పితాలను సృష్టించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకడు చిత్రాన్ని నిర్మిస్తాడు. సినిమా చిన్నదైనా, పెద్దదైన కొన్నిసార్లు ఆ సినిమాలో తప్పులు జరుగుతూ ఉండటం సహజం. అయితే గతంలో ప్రేక్షకులు సినిమాల్లో కనిపించే తప్పులను ఎక్కువగా గమనించేవారు కాదు. అప్పుడు సోషల్ మీడియా వాడకం కూడా పెద్దగా ఉండేది కాదు. ఆ తప్పులను గమనించినా వారిలో వారే మాట్లాడుకుని సైలెంట్ అయ్యేవారు.

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వేగవంతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు నిర్మిస్తున్న సినిమాల్లో చిన్న మిస్టేక్ దొరికినా సోషల్ మీడియాలో ఆ సీన్‌ను రిపీట్ చేస్తూ హల్‌చల్ చేస్తుంటారు. అలా ఆ తప్పులను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూ దర్శకులకు తలనొప్పిగా మారుతారు. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన సినిమా ‘మర్యాద రామన్న’. ఈ చిత్రంలో ఓ సీన్‌లో చేసిన మిస్టేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ సీన్ ఏంటో ఒక్కసారి చూద్దామా.

ఈ చిత్రంలో హీరో సునీల్ ట్రైన్‌లో హీరోయిన్‌తో పాటు కూర్చొని ప్రయాణం చేస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ కొబ్బరి నీళ్లు తాగాలని అనుకుంటుంది. దీంతో హీరో కొబ్బరి బొండం తీసుకునే సీన్ అందరికీ బాగా గుర్తుకు ఉండే ఉంటుంది. ఇక ఆ సీన్ చూసిన వారంతా కడుపుబ్బా నవ్వుకొని ఉంటారు. అయితే ఈ సీన్‌లో మొదట కొబ్బరి బొండాలు కొనే సమయంలో సునీల్ ట్రైన్ డోర్ నుండి మూడవ కిటికీ దగ్గర కూర్చుంటారు.

కానీ తరువాత షాట్‌లో సునిల్ డోర్ పక్కన ఉన్న కిటికీ దగ్గర కనిపిస్తాడు. అంతేకాదు.. సునీల్ కూర్చున్న సీటు దగ్గర కిటికీకి ఉండే ఊచలు కూడా చాలా తేడాగా కనిపిస్తాయి. అయితే సినిమాలో ఇలాంటివి సాధారణమే అయినప్పటికీ చిన్న మిస్టేక్‌ని కూడా తప్పుగానే భావిస్తుంటారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాతో సునీల్ సినీ కెరీర్ మలుపు తిరిగిందని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chengala Venkat Rao: జూనియర్ ఎన్టీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు వైరల్!

Chengala Venkat Rao: చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం కాదు గాని ప్రతీ వైసీపీ నాయకుడు నోటికి వచ్చిన స్టేట్మెంట్ ఇస్తూ వెలుగులోకి వస్తున్నారు. అందులో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటం...
- Advertisement -
- Advertisement -