Vastu Tips: మీ ఇంట్లో ఈ వస్తువులు అయిపోయాయా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Vastu Tips: ఇటీవల కాలంలో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇంట్లో ఆఫీసులలో వ్యాపార స్థలాలలో ఇలా ప్రతి ఒక్క ప్రదేశంలో వాస్తు విషయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అలాగే చాలామంది ప్రతి ఒక్క విషయాన్ని వాస్తు ప్రకారం గా ఉండేలా చూసుకుంటున్నారు. మామూలుగా పల్లెటూర్లలో మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు అయిపోతే ఇరుగుపొరుగు వారిని అడిగి తీసుకుంటూ ఉంటారు. పల్లెటూర్లలో ఇచ్చిపుచ్చుకోవడం అన్నది మామూలుగా జరుగుతూ ఉంటుంది.

కానీ వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఎప్పటికీ అయిపోకుండా చూసుకోవాలట. లేదంటే ఆర్థిక సమస్యలతో పాటు అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మరి ఇంట్లో ఎటువంటి వస్తువులు అయిపోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి కోపం కలిగించే పనులు మనం చేయకూడదు. లక్ష్మీదేవి కోపానికి కారకులైతే ఆర్థిక సమస్యలు తప్పవు. లక్ష్మీదేవి అనుగ్రహించింది అంటే బిచ్చగాడు అయినా కోటీశ్వరుడు గా మారిపోతాడు.

అదే లక్ష్మీదేవి కోపగిచ్చింది అంటే కోటీశ్వరుడు అయిన బిచ్చగాడుగా మారాల్సిందే. మామూలుగా మనకు ఇంట్లో ఎన్నో రకాల పిండిలు ఉంటాయి. గోధుమపిండి జొన్నపిండి సద్దపిండి ఇలా అనేక రకాల పిండిలు ఉంటాయి. ఏదో ఒక రకం పిండి ఇంట్లో ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. వాస్తు శాస్త్ర ప్రకారము ఒకవేళ పిండి ఇంట్లో అయిపోతే గౌరవం కూడా కోల్పోతారని అర్థం. అలాగే పసుపు కూడా ఒకటి. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. యాంటీ బ్యాక్టీరియల్ గా కూడా పసుపు ఉపయోగపడుతుంది. పసుపును దేవుడి కోసం అలాగే వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి పసుపును తప్పనిసరిగా ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి.. ఒకవేళ పసుపు కనుక అయిపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. అదేవిధంగా అనుకున్న శుభకార్యాలు సమయానికి పూర్తి కావు. అలాగే ఇంట్లో ఉప్పు కూడా ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పుతో పాటు బియ్యం కూడా ఎప్పుడూ పూర్తిగా అయిపోయేంత వరకు ఉండకూడదు. కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో కొద్ది కొద్దిగా ఉండగానే ఇంకా కొంచెం తెచ్చి పెట్టుకోవడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -