Vasthu: ఇంటి నిర్మాణం మధ్యలో ఆపేశారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Vasthu: సాధారణంగా కొన్ని కొన్ని సార్లు మనం ఇల్లు కట్టేటప్పుడు అనుకోని కారణాల వల్ల ఇల్లు మధ్యలో కట్టడం ఆపేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ముందుగా చేయాల్సిన పనులేంటి, పెండింగ్ పెట్టాల్సిన పనులేంటన్నది క్లారిటీ ఉండాలి. ఈ పద్ధతులు ఫాలో అవకపోతే వాస్తు దోషాలు తప్పవు అంటున్నారు నిపుణులు. ఇంటి నిర్మాణం మధ్యలో ఆపేయాల్సి వస్తే వాస్తు ప్రకారం ముందుగా ఏం పూర్తిచేయాలి, ఏ పనులు పెండింగ్ పెట్టాలి. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇంటిలోపల ఫ్లోరింగ్‌ ఆపొచ్చు కానీ వాస్తు రీత్యా ఆర్డినరీ గచ్చు వేయాలి. ఇంటి లోపలలో లెవల్‌ పెట్టకూడదు. అలాగే లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్‌ బోర్డులు, షో కేసులకు సంబంధించిన చెక్కపని ఆపవచ్చు కానీ ఇంటిలోపల టాయ్‌లెట్‌ కోసం గది నిర్మించినప్పటికీ లోపల పనిముట్లు పెట్టకుండా వాయిదా వేయవచ్చు. అలాగే ఫ్లోరింగ్‌కు సంబంధించి అన్ని గదుల్లోనూ టైల్స్‌ పని ఆపుకోవచ్చు. ఇంటి ఆవరణలో సిమెంట్ పనులు ఆపవచ్చు కానీ మట్టితో లెవెల్ చేయించాలి. అదేవిధంగా పూజగది కట్టిన తర్వాతే దానిలో అలంకరణకు సంబంధించిన పని చేయాలి..గ్రిల్‌కు సంబంధించిన పనులు, కాంపౌండ్‌ గేట్లు ఆపుచేసుకోవచ్చు, మెట్ల నిర్మాణం కూడా వాయిదా వేసుకోవచ్చు.

 

కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయటాన్ని ఆపవచ్చు. కాంపౌండ్‌ వాల్ నిర్మాణం ఆపుకోవచ్చు కానీ గోడ మాత్రం సరిగా ఉండేలా చూసుకోవాలి. శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టింగ్, ఫినిషింగ్ తప్పనిసరిగా చేయాలి ఇంటిలోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి అదేవిధంగా గృహ ఆవరణలో మట్టి నింపే పని అసంపూర్ణంగా ఆపకూడదు. అలాగే మేడ మీద,మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు. గృహ నిర్మాణం పూర్తైన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు. గృహ నిర్మాణం పూర్తైన తర్వాత గృహ ఆవరణలో ఆగ్నేయం, నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశల్లో ఉన్న పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించకూడదు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -