Geoffrey Hackett: 20 నిమిషాల సెక్స్‌ మంచిదట..!

Geoffrey Hackett: సెక్స్‌ అనే ఓ కొత్త అనుభూతితో పాటు శారీరక వ్యాయామం అంటారు సెక్సాలజిస్టులు. అది అంటే ఇష్టపడి వారుంటరు. భార్యభర్తల మధ్య ఓ నమ్మకం. ప్రేమ కలిగించే వివిధ అంశాల్లో శృంగారం మొదటిది. 20 నిమిషాల పాటు శృంగారంతో కూడిన సెక్స్‌ చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ‘ది జర్నల్‌ ఆఫ్‌ సెక్సువల్‌ మెడిసిన్‌’లో ప్రచురించిన ఒక అధ్యయనం ద్వారా వెల్లడైందిజ గత రెండేళ్ల క్రితం కరోనా లాక్‌డౌన్‌ సమయంలో లైంగిక సంబంధం కొనసాగించే వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం 34 శాతం తక్కువని అద్యాయనం వెల్లడైంది. సెక్స్‌ అనేది సాధారణ ఆరోగ్యానికి ముఖ్యమైన బె రోమీటర్‌ అని మరికొంత మంది నిపుణులు నమ్ముతారు. అయితే, వీటిలోని నిజనిజాలు నిర్ధారించేందుకు రోగులతో చర్చించాల్సి ఉంఒటుంది. అయితే.. రోగుల లైంగిక కార్యకలాపాల గురించి చాలా తక్కువగా అడుగుతారు వైద్యులు.

ఒక వైద్యుడిగా, మహిళలను వారి రుతుచక్రం గురించి అడగడంలో సంకోచించాల్సిన అవసరం ఉండదు. కాగా మహిళల లైంగిక కార్యకలాపాలపై చాలా అరుదుగా చర్చిస్తాం. ఇక ఈ సమస్య పురుషులతో మరింత అధ్వాన ంగా ఉంటుంది. అయినా ఒక వ్యక్తికి క్రమం తప్పకుండా అంగస్తంభనలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం అతని ఆరోగ్యం గురించి పలు విషయాలను వెల్లడిస్తాయని ఆస్టన్‌ యూనివర్సిటీలో యూరాలజిస్ట్, పురుషుల ఆరోగ్యంపై పనిచేస్తున్న ప్రొఫెసర్‌ జెఫ్రీ హాకెట్‌ తన అనుభవాన్ని వెల్లడించారు.

వివిధ కారణాలతో అంగస్తంభన పొందలేకపోతారు. పురుషాంగానికి సరఫరా అయ్యే ధమనులకు ఆటంకం కలగడంతో కూడా ఓ ప్రధాన కారణమే. అయితే, శారీరకంగా సెక్స్‌ చేయగలిగే సామర్థ్యం కూడా ఒక నిర్దిష్ట స్థాయిలో ఫిట్‌నెస్‌కు సూచనగా అనుకోవాలని నిపుణులు భావిస్తున్నారు. మనిషిలో 20 నిమిషాల లైంగిక కార్యకలాపాలు ఒక కిలో మీటరు దూరం వాకింగ్‌తో సమానమని.. ఇలా తరచూ సెక్స్‌ చేస్తే అది సహేతుకమైన శారీరక శ్రమ అవుతోందని ప్రొఫెసర్‌ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -