Nara Lokesh: 2019 ఎన్నికల తర్వాత అలా చేశా.. లోకేశ్ కామెంట్స్ వైరల్!

Nara Lokesh: ఏపీలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది 2024 లో రాష్ట్ర ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటినుంచి సిద్ధం చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇప్పటికే జనసేన టిడిపి పార్టీలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా సైకిల్ హవానే నడుస్తోంది. ఏపీలో 70 శాతం మంది వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం గెలవాలి అని కోరుకుంటుండగా 30 శాతం మంది మళ్లీ వైసీపీ నే రావాలని కోరుకుంటున్నారు.

ఇదే విషయం గురించి రాజకీయ నాయకుల మధ్య మాటలు ఇద్దరు కూడా జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా గుప్పించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఏడాది జనవరి నుంచి నారా లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. యువగలం పేరుతో మొదలుపెట్టిన నారా లోకేష్ జిల్లాలు గ్రామీణ ప్రాంతాలు అన్ని తిరుగుతూ ప్రజల పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు అక్కడి ప్రజలతో ముచ్చటిస్తున్నారు. ఇకపోతే 2019లో జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓడిపోవడంతో వైసిపి పార్టీ గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఎలా అయినా 2024 ఎన్నికలలో గెలిచి నిరూపించాలి అని టిడిపి పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది.

 

2024లో గెలిచి చూపించమంటూ వైసీపీ పార్టీ టిడిపి పార్టీకి సవాల్ విదురుతున్న సంగతి తెలిసిందే. టిడిపి కూడా తగ్గేది లే అన్నట్టుగా గెలిచి చూపిస్తాం అంటూ సవాల్ విసురుతున్నారు. ఇది ఇలా ఉంటే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా తాజాగా 2019లో ఎన్నికల గురించి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల ఓడిన తర్వాత బాధపడ్డాను. మేం అక్కడే తప్పు చేశాం అని తెలిపారు లోకేష్. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి మరి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే తన వారాహి వాహనంపై ప్రచార కార్యక్రమాలను చేస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -