Health Tips: ఈ సమస్యలు ఉన్నవారు అరటిపండు తింటే అంతే సంగతులు?

Health Tips: సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పాటు దొరికే పండ్లు ఏవైనా ఉన్నాయి అంటే అవి అరటి పండ్లు మాత్రమే అని చెప్పవచ్చు. అరటిపండు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అతి తక్కువ ధరకే ఈ పండ్లు అందుబాటులో ఉంటాయి. అరటిపండ్లను చిన్న పిల్లలనుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అరటిపండ్లు టేస్టీగా ఉండటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అరటిపండును తినడం మంచిది కానీ మోతాదుకు మించి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు. అరటిపండ్లలో పలు రకాలు కూడా ఉన్నాయి. వాటిలో ఇలాచీ అరటిపండు కూడా ఒకటి. మరి ఈ ఇలాచి పండు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

ఈ ఇలాచీ అరటిపండ్లు బెంగళూరులోని యెలక్కి అని బీహార్‌లోని చినియా ఇలా ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. సాధారణ అరటిపండ్లతో పోలిస్తే ఇలాచి అరటిపండ్లు తియ్యగా ఉంటాయి. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో, ముఖ్యంగా ముంబై, బెంగళూరులో వంటి ప్రాంతాలలో ఇవి ఈజీగా దొరుకుతాయి. అయితే ఇలాచీ అరటిపండ్లు సైజ్‌లో చిన్నగా ఉంటాయి. కానీ, సాధారణ పరిమాణ అరటిపండుతో సమానంగా పోషకంగా ఉంటుంది. ఈ మరగుజ్జు అరటిపండ్లు సాధారణ అరటిపండ్ల కంటే చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ఇలాచీ అరటిపండ్లు విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. వర్కౌట్ తర్వాత వీటిని స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి ఇతర ముఖ్య పోషకాలు కూడా ఈ అరటిపండ్లలో ఉంటాయి.

 

వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. మీ రక్తపోటు స్థాయిలను చెక్ చేయడంలో కూడా సాయపడతాయి. ఇలాచీ అరటిపండ్లని వాటి సహజ తీపి కారణంగా డెజర్ట్స్ తయారు చేయడానికి ఎక్కువగా వాడతారు. బ్రెడ్, పుడ్డింగ్ నుండి పాన్ కేక్స్, మఫిన్స్ వరకు ఇలాచీ అరటిపండ్లని వివిధ రకాల వంటలు చేసేందుకు వాడొచ్చు. వీటిలో కొన్ని దేశీ వంటకాలలో కూడా వాడతారు. బనానా అప్పం, బనానా ఖీర్, బనానా పువా, బనానా వడలు కూడా చేస్తారు. అరటిపండు తినడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి అన్ని వయసుల వారు ఈ ఇలాచి అరటిపండ్లను హాయిగా తినొచ్చు. రాత్రిపూట ప్రత్యేకించి చలికాలంలో కొంతమందికి శ్వాస సమస్యల్ని కలిగించొచ్చు. కాబట్టి తగ్గించాలి. మీరు జలుబు, దగ్గుతో బాధపడుతుంటే అరటిపండు తినకపోవడమే మంచిది. ఎందుకంటె అవి లక్షణాలను మరింత పెంచుతాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -