Health Tips: శరీరంలో వేడి పోవాలా అయితే ఈ టిప్స్ మీకోసమే?

Health Tips: ఈ మధ్యకాలం చాలామంది వేడి సమస్యతో బాధపడుతున్నారు. కారణమేంటంటే తినే ఆహారపు అలవాట్ల వల్ల ప్రతి ఒక్కరు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా వేడి చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఉప్పు, కారం, మసాలాలు, జంక్ ఫుడ్, మద్యం, మాంసాహారం ఇలా ఏమి తీసుకున్న శరీరానికి వేడి చేస్తుంది.

ఇక వేడి ఎక్కువైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తో పాటు పసుపు రంగులో వస్తుంది. అంతేకాకుండా మూత్రంలో మంట కూడా వస్తుంది. ఇక పాదాలు, చర్మం వంటివి పగిలినట్లు అనిపిస్తాయి. అయితే ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే రోజుకు మూడుసార్లు మూడు కీరదోసలను తీసుకోవాలి.

అంతేకాకుండా పరిగడుపున పుదీనా రసం తీసుకున్న కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక తర్బూజ, పుచ్చకాయ, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ కాయల జ్యూస్ తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఇక గంధంను పొడిచేసి ఆ పేస్టును నుదిటిపై పెట్టుకున్నప్పటికీ కూడా వేడి తగ్గుతుంది.

రోజుకు మూడు నుంచి నాలుగు నీటిని తీసుకోవడం చాలా ప్రధానమైనది. ఎక్కువగా నీటి శాతం ఉండే పండ్లను తీసుకోవాలి. ఇక నిమ్మరసం మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని పాలలో తేనె కలుపుకొని తాగినా కూడా శరీరంలో వేడి తగ్గుతుంది.

కాబట్టి శరీరంలో వేడి ఉన్నవాళ్లు ఇటువంటివి చేస్తే చాలు వెంటనే శరీరంలో వేడి తగ్గిపోతుంది. ఇవేవి తీసుకోకున్నా కూడా.. కేవలం మూడు లీటర్ల మంచి నీళ్లు తాగితే ఎటువంటి సమస్య ఉండవు. కాబట్టి ప్రతిరోజు మూడు లీటర్ల నీటిని తీసుకోవటానికి ఆసక్తి చూపించండి. నీటి వల్ల కేవలం వేడిమే కాకుండా ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -