Health Tips: చలికాలంలో దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడుతున్నారా? సింపుల్‌ రెమెడీస్‌ ఇవే!

Health Tips: చలికాలంలో చాలా మంది దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. ఇవి రెండూ అటాక్‌ చేయడం మొదలు పెట్టాయంటే ఇక తలనొప్పి కూడా వచ్చి చేరుతుంది. ఇక ఏ పని చేయాలన్నా చికాకుగా ఉంటుంది. ఓ దుప్పటి తీసుకొని కప్పుకొని నిద్రపోతూ ఉందాం.. అనిపిస్తుంది. ఇలా బద్దకం కూడా తోడై నిత్యం పనులు చేసుకొనే మూడ్‌ లేకుండాపోయి డిస్టబ్‌ అవుతుంటారు.

సాధారణంగానే అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రతి దానికీ డాక్టర్‌ వద్దకు వెళ్లడానికి ఇష్టం ఉండదు చాలా మందికి. ఇందుకు వంటింట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సింపుల్‌గానే సాధారణ జబ్బుల నుంచి బయట పడొచ్చు. ఆయుర్వేద గుణాలు కలిగిన అనేక పదార్థాలు మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

ఇంగువ ఉపయోగించడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి ఎక్కువగా బాధిస్తున్నట్లయితే ఇంగువతో పరిష్కారం పొందవచ్చు. తలనొప్పితో బాధపడుతున్న వారు ఇంగువ కలిపిన నీరు తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇందులో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. అలాగే రక్త నాళాలలో వాపును తగ్గించడానికి కృషి చేస్తుంది. తద్వారా తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.

ఇంగువ కలిపిన నీటితో ఇలా చేయండి..
ఇక జలుబు సమస్య సాధారణంగా చాలా మందికి వస్తుంటుంది. గోరు వెచ్చని నీటిలో ఇంగువ కలిపి తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. జలుబు, దగ్గు సైతం తగ్గిపోతుంది. గొంతు సమస్యలున్నా పరిష్కారమవుతాయి. చలికాలం నేపథ్యంలో గొంతులో బ్యాక్టీరియాలు చేరకుండా ఇది చక్కటి మార్గం. మరోవైపు అధిక బరువుతో బాధపడుతున్న వారు కూడా ఇంగువ నీరు తాగడం వల్ల వెయిట్‌ లాస్‌ పొందవచ్చు. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను ఈ నీరు తగ్గించేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -