Health Tips: ఆ సమస్యలకు చెక్‌ పెట్టాలంటే ఇవి తరచూ తినాలి!

Health Tips: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారుతుంటాయి. రోజు తీసుకునే వివిధ రకాల ఆహారంతో కొన్ని సార్లు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయి. నేటికాలంలో ఎక్కువగా పిజ్జాలు, బర్గర్లు తిని వివిధ సమస్యలతో బాధపడుతున్నారు.అతి చిన్న వయస్సులనే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ మంచాన పడుతున్నారు. ఉప్పు, చక్కెర  తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నా వారి మాటలను పక్కనపెట్టి నోటి రుచికోసం ఎక్కువ స్పైసీ, తీసి పదార్థాలు తిని కొత్త కొత్త రోగాలకు స్వాగతం పలుకుతున్నారు. సహజసిద్ధంగా లభించే ఆహార పదార్థాలు తింటే జీవితాంతం ఏ రోగం మీ దరిచేరదు ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా బాదం పప్పు, శనగలు రోజూ తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు నిరంతరం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాక  శరీరం పుష్టిగా కూడా ఉంటుంది. ఇలాంటి పదార్థాలు తినడం తో శరీరం ముడతలు కూడా పడకుండా ఉంటుంది. ఎక్కువ పని చేసినప్పుడు వెంటనే అలసటగా వస్తుంది. అయితే ఇలా రావడానికి పౌష్టికాహార లోపమే అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి ధాన్యాలు తింటే అలసట,  రక్తహీనత సమస్య కూడా వెంటనే తొలగిపోతుందని సూచిస్తుంటారు. అయితే మాసం తినని వారికి నానబెట్టిన శనగాలు బాగా పనిచేస్తాయి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు ఉండటంతో మాంసంతో సమానంగా రోగనిరోధక శక్తి వస్తోంది. ప్రతి రోజూ ఒక కప్పు శనగలతో పాటు కొన్ని బాదం పప్పులు తింటే శరీరం దృఢంగా ఉంటుంది.
 శనగాల్లో పోటాషియం పుష్కలంగా ఉండటంతో  సీజనల్‌ వ్యాధులు సైతం దరి చేరవు. ఒక కప్పు శనగలు తినడంతో 474 మి. గ్రాముల పొటాషియం లభిస్తోంది. ఈ పోటాషియం శరీరంలో బీపీని కంట్రోల్‌ చేస్తోంది. అంతేకాక గుండె సంబంధిత వ్యాధులను నియంత్రిస్తోంది. ఫైబర్‌ ఎక్కువ మోతాదులో ఉండే శనగలతో జీర్ణ వ్యవస్థ కూడా బాగా పని చేస్తోంది. ఒక రోజు అవసరమయ్యే ప్రోటీన్‌లో మూడవ వంతు ప్రోటీన్‌ 28 గ్రాముల శనగాల్లో ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. పొట్టు తీసిన శనగల కన్నా పొట్టు తీయకుండా తింటే మంచిదట. డయాబెటిస్‌ ఉన్న వారు కూడా శనగలను తరచూ తింటే షుగర్‌ లెవల్‌ను కంట్రోల్‌ చేయొచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -