Health tips: బరువు తగ్గేటప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి?

Health tips: ప్రస్తుత జనరేషన్ లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారింది. ఈ అధిక బరువు సమస్యతో ఎంతో మంది మహిళలు పురుషులు బాధపడుతున్నారు. ఈ అధిక బరువు సంస్థ కారణంగా ఎటువంటి పనులు చేయలేకపోతున్నారు. అంతే కాకుండా అధిక బరువుతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. అధిక బరువు సమస్య కారణంగా గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, వాపులు స్థూలకాయం మట్టి ఎన్నో ప్రమాదకర సమస్యల బారిన పడుతున్నారు.

 

బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గే సమయంలో కొన్ని రకాల పనులను అస్సలు చేయకూడదు. మరి బరువు తగ్గే ప్రాసెస్ లో ఎటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది అధిక బరువు ఉన్నవారు ఎక్కువసేపు తినకుండా ఉంటే ఈజీగా బరువు తగ్గుతారని అనుకుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ విధంగా ఎక్కువ సేపు ఆహారం తినకుండా ఉండటం వల్ల జీవక్రియ రేటు తగ్గి అది మిమ్మల్ని బరువు తగ్గించడం కాకుండా మరింత బలహీనంగా చేస్తుంది. గ్యాప్ తీసుకుని తినడం మంచిదే కానీ ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలి అనుకున్న వారు చాలామంది చేసే మొదటి తప్పు బ్రేక్ ఫాస్ట్ మానేయడం.

 

ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేస్తే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే చాలామంది బరువు తగ్గాలి అనుకున్న వారు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం మానేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ప్రోటీన్స్ కండరాల అభివృద్ధి సహాయపడతాయి. అంతేకాకుండా ప్రోటీన్స్ మన చేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. కాబట్టి సోయాబీన్స్ గుడ్లు కాయ దాన్యాలు వంటివి తినాలి. చాలామంది తిన్న వెంటనే పడుకుంటూ ఉంటారు. కానీ రాత్రి సమయంలో తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే బరువు కూడా తగ్గుతారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -