Health Tips: వయసు పెరుగుతున్న బరువు పెరగకూడదు అంటే ఈ పని చేయాల్సిందే?

Health Tips: చాలామందిలి వయసు పెరుగుతున్న కొద్ది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్ది ఒంట్లో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోషకాహారం లోపించినప్పుడు అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ శరీర బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. పెద్ద వయసు వారు బరువు పెరిగితే తగ్గడం చాలా కష్టం. ఎందుకంటె వయసు ఎక్కువగా ఉన్నవారు వ్యాయామాలు ఎక్కువ చేయలేరు ఎక్కువ శ్రమించలేరు.

 

అలాగే డేట్ ని కూడా ఫాలో అవ్వలేరు. కాబట్టి వయసుతో పాటు బరువు కూడా పెరగకుండా ఉండాలి అంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. ఇందుకోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలతో పాటు కిచిడి లేదంటే ఓట్మిల్క్ మిల్క్, వెజిటేబుల్స్ లాంటివి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే తేలికపాటను డైట్ ఫాలో అవ్వాలి అనుకున్నవారు రోటీ వెజిటేబుల్స్ ను , సలాడ్స్ విత్ డాల్ ను కూడా తీసుకోవడం మంచిది. అదేవిధంగా వేసవిలో మధ్యాహ్న సమయంలో భోజనంలో శెనగపప్పు లేదా మజ్జిగను తీసుకోవచ్చు. అలాగే పండ్లను తినడం జ్యూస్ లు తాగడం లాంటివి చేయాలి.

 

సాయంత్రం సమయంలో చాలామంది ఆకలిగా అనిపిస్తే టీ తాగుతూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ టీలో ఉండే పాలు షుగర్ బరువు పెరగడానికి సహాయపడతాయి. కాబట్టి వీటికి బదులుగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే డిన్నర్ సమయంలో ఎక్కువగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అలాగే రాత్రి సమయంలో కూరగాయలు రోటి పప్పును మాత్రమే తినాలి. అలాగే చీజ్ సలాడ్ లేదా సోయాబీన్ మిక్స్ సలాడ్, ఓట్ మీల్ లేదా కిచిడీ తీసుకున్నా మీ బరువు అదుపులో ఉంటుంది. శరీరం ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే శరీరంలో నీటి కొరత ఏర్పడి ఒంట్లో శక్తి తగ్గుతుంది. అంతేకాదు నీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా.. కుట్రలకు బలి కామని జనం చెబుతున్నారా?

YSRCP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజుకు రాజుకుంటుందని చెప్పాలి. మరి 20 రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను నామినేషన్లను దాఖలు చేస్తూ...
- Advertisement -
- Advertisement -