Health Tips: వీర్య కణాలు పెరగాలంటే వీటిని తినాల్సిందే?

Health Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అంత ఉత్పత్తి సమస్యలకు ఇతర కారణాలతో పాటు స్పెర్మ్ కౌంట్ తగ్గడం అన్నది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. పురుషులలో తగినన్ని శుక్రకణాలు లేకపోవడం వల్ల కూడా ఈ సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. అయితే చాలా మంది పురుషులు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డార్క్ చాక్లెట్ తినడం వల్ల అది స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

 

దాక్కు చాక్లెట్ ను కొకోవా అనే గింజలతో తయారుచేస్తారు. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శుక్రకణాలను పెంచడానికి ఉపయోగపడతాయి. గుడ్డును తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్లు విటమిన్లు చేయడానికి అందుతాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే అరటి పండ్లు తీసుకోవడం వల్ల అందులో ఉండే బ్రోమోలైన్ అనే ఎంజైమ్ శుక్ర కణాలను పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే అరటి పండ్లు విటమిన్ సి విటమిన్ బి1 మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. వెల్లుల్లిలో ఉండే సెలీనియం అనే ఎంజైమ్ శుక్రకణాలను పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా వాటిలో ఉండే అలిసిన్ శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడం కోసం తినే ఆహార పదార్థాలలో పాలకూర ఒకటి.

 

పాలకూరలో ఉండే పోలిక్ యాసిడ్ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పాలకూర తినడం మంచిది. పాలకూర తింటే స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది. అలాగే వాల్ నట్స్ తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. వాల్ నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శుక్రకణాల సంఖ్యను పెంచడానికి ఎంతో బాగా పడతాయి. అలాగే దానిమ్మ పండు తినడం వల్ల వాటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే గుమ్మడి గింజలు తినడం వల్ల వాటిలో ఉండే ఫైటో స్టెరోల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్ వీర్య కణాలను పెంచుతాయి. చేపల్లో జింక్ తో పాటుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. సంతానోత్పత్తి సమస్యతో బాధపడుతున్న వారు చేపలను తరచుగా తింటే మంచిది.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -