Health Tips: శీతాకాలంలో నల్ల మిరియాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

Health Tips: మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో నల్ల మిరియాలు కూడా ఒకటి. ఇవి చాలా ఘాటుగా ఉండడంతో వీటిని చాలామంది తినడానికి ఇష్టపడరు. అయితే నల్ల మిరియాలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇతర సీజన్లతో పోల్చుకుంటే చలికాలంలో నల్ల మిరియాల రోజు తినాలి. ఎందుకంటే నల్ల మిరియాలు తినడం వల్ల చలికాలంలో వచ్చే దగ్గు జలుబు లాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. నల్ల మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

 

నల్ల మిరియాల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే అద్బుతమైన యాంటీ బయోటిక్ అని చెప్పవచ్చు. చలికాలంలో నల్ల మిరియాలు తినడం వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆహారంలో భాగంగా కాకుండా నల్ల మిరియాలు పచ్చిగా తినడం వల్ల కడుపులో హైడ్లోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. నల్ల మిరియాలు మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. అలాగే వారంలో రెండు మూడు సార్లు కంటే తక్కువ సార్లు మలవిసర్జనకి వెళుతున్నట్లు అయితే మలబద్ధకం బారిన పడ్డారు అని అర్థం చేసుకోవాలి.

 

అటువంటి సమయంలో క్రమం తప్పకుండా నల్ల మిరియాలు తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. అలాగే గ్రీన్ టీ లో నల్ల మిరియాలు వేసుకొని ప్రతిరోజు రెండు మూడు సార్లు తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. నల్ల మిరియాలలో అధిక మొత్తంలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉండి అవి అదనపు కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతాయి. ఇవి మీ శరీర జీవక్రియను కూడా పెంచుతాయి. కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతాయి. సాధారణంగా శీతాకాలంలో కీళ్లనొప్పులు, ఎముకల నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మల్ల మిరియాలు తినడం వల్ల ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది. నల్లమిరియాల్లో ఉండే పైపెరిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -