Health Tips: కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారం.. అవేంటో తెలుసా?

Health Tips: పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్ చాలా ఉంది ఈ కూరను ఇష్టపడుతుంటే మరికొందరు తినడానికి ఇష్టపడరు. ఈ పుట్టగొడుగులు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసింది. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. అలాగే శరీరంలో రక్తం సరిపడా లేకపోతే పుట్టగొడుగులను తినడం మంచిది. పుట్టగొడుగులలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ తగిన మోతాదులో లభిస్తాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పుట్టగొడుగులలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయి.

 

వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలి అనుకున్న వారు పుట్టగొడుగులను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే మొటిమల సమస్యతో బాధపడేవారు పుట్టగొడుగులను తినడం ద్వారా కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ప్రతి రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పుట్టగొడుగులను చేర్చుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. పుట్టగొడుగులను తీసుకుంటే అది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే బీటా గ్లూకాన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉన్నందున గుండెకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.

 

అలాగే పుట్టగొడుగులను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలో అదుపులో ఉంటాయి. పుట్టగొడుగులను తినడం వల్ల క్యాన్సర్, థైరాయిడ్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా పుట్టగొడుగులను తీసుకోవాలి. పుట్టగొడుగులను తినడం వల్ల మీ శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. ఇది కాకుండా ఇది ఇన్సులిన్ స్థాయిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -