Health Tips: పరగడుపున ఎటువంటి ఆహార పదార్థాలు తినాలో తెలుసా?

Health Tips: సాధారణంగా మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తాయి. మరి ముఖ్యంగా పరగడుపున తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అలాగే ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. మరి ఉదయం పూట ఎటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాదం పప్పులో ఐరన్,జింక్,రాగి వంటి ఎన్నో మంచి మంచి పోషకాలు లభిస్తాయి.

 

ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు కూడా దూరం అవుతాయి. అలాగే చియా విత్తనాల్లో కూడా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని పరిగడుపు తింటే మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి. అప్పుడే వీటిలో ఉండే ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. బరువు తగ్గాలి అనుకున్న వారికి చియా విత్తనాలు ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. అలాగే బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లకు బొప్పాయి ఎంతో బాగా పనిచేస్తాయి.

 

బొప్పాయిలో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. బొప్పాయి పండు తిన్న తర్వాత 45 నిమిషాల వరకు మీరు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం మంచిది. అలాగే పుచ్చకాయను వేసవిలో తినడం మంచిది. పుచ్చకాయలు 90 శాతం నీరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. వేసవిలో పుచ్చకాయను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఈ విధంగా ప్రతిరోజూ లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చనే నీళ్లలో కాస్త నిమ్మరసం, తేనె వేసుకుని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా ఓవర్ వెయిట్ కూడా తగ్గుతుంది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -