Health Tips: క్యాలీఫ్లవర్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: మన వంటింట్లో దొరికే కూరగాయలలో కాలిఫ్లవర్ కూడా ఒకటి. క్యాలీఫ్లవర్ ను ఉపయోగించి ఎన్నో రకాల వంటలను తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కాలీఫ్లవర్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కాలిఫ్లవర్ లో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. క్యాలీఫ్లవర్ ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. గుండె జబ్బులు క్యాన్సర్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. క్యాలీఫ్లవర్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలి అనుకున్న వారికి ఇది ఒక చక్కటి ఆహారం అని చెప్పవచ్చు.

 

క్యాలీఫ్లవర్ ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. క్యాలీఫ్లవర్ లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పేగు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. క్యాలీఫ్లవర్ ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. క్యాలీఫ్లవర్ లో కోలిన్ అధికంగా ఉంటుంది. ఇది కణ త్వచం సమగ్రతను కాపాడడంలో, డీఎన్ఏ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. కాలేయంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

 

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను తయారు చేస్తుంది. క్యాలీ ఫ్లవర్ క్యాన్సర్, కణితి పెరుగుదలను ప్రోత్సహించే ఎంజైమ్‌లను నిరోధిస్తుంది. తద్వారా క్యాన్సర్ అభివృద్ధిని అణిచివేయడంలో సహాయపడుతుంది. దెబ్బతిన్న కణాలను నాశనం చేయడం ద్వారా సల్ఫోరాఫేన్ క్యాన్సర్ పెరుగుదలను ఆపగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -