Health tips: చలికాలం లో వచ్చే అన్ని సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టాలనుకుంటున్నారా అయితే ఇది తినండి!

Health tips: ఈ సంవత్సరం చలి అందరినీ చాలా ఇబ్బంది పెడుతోంది. అప్పుడే మొదలైన చలి కొన్ని ప్రాంతాలలో మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. మరోపక్క గ్రామాల్లో ఉదయం 8 గంటలైనా మంచు కొమ్ముకొని ఉంటుంది. ఈ వాతావరణం కంటికి ఆహ్లాదంగా ఉన్నప్పటికీ మన శరీరానికి తెలియకుండా ఎన్నో ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ అత్తి పండ్లు మార్కెట్లో ఈ సీజన్ విరివిగా దొరుకుతాయి. కానీ తినేముందు ఈ పండ్లను కాసేపు ఉప్పునీటిలో ఉంచి బాగా శుభ్రం చేశాక తినాలి.

 

చలి పెరిగినప్పుడు అనేక సూక్ష్మజీవులు విజృంభిస్తాయి. బ్యాక్టీరియా ,వైరస్ ,ఫంగస్ ,ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఈ చలికాలంలో ఉంటుంది. అలాగాని ప్రతి చిన్న సమస్యకు మాత్రే పరిష్కారంగా బతకలేము కదా. కొన్ని రోగాలను మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం ద్వారా అరికట్టవచ్చు. మనకు వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.

 

చలికాలంలో ఎక్కువగా దొరికే సీజనల్ ఫ్రూట్ అంజీర్. ఈ అరటి పండ్లను ఎప్పటినుంచో సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి, కాబట్టి వీటిని కొన్ని ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతారు. అంజీర్ పండ్లలో మెగ్నీషియం, ఐరన్ ,పొటాషియం ,కాల్షియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది మనకు ఈ సీజన్లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ను నివారించడంలో సహాయపడతాయి.

 

ఇవి మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీర ఉష్ణ శాతాన్ని పెంచి వెచ్చగా ఉంచుతాయి. వీటిలో ఉండే పోషక విలువలు శ్వాసకోశ సంబంధిత పలు రోగాలను నివారిస్తాయి. ఈ అత్తి పండ్లల్లో మెండుగా దొరికే ప్రోటీన్ ,ఫైబర్ ,విటమిన్స్ మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే చలి మంచు వల్ల ఏర్పడే కఫం ,గొంతు నొప్పి ,దగ్గు వంటి సమస్యలకు కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా చలికాలంలో ఈ పండ్లు రెగ్యులర్ గా తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -