Health Tips: వాటిని తింటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగకూడదు!

Health Tips: ఉరుకులు పరుగుల బిజీలైఫ్‌లో చాలామంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. సాధారణంగా తాగడం లేదా తినే ముందు లేదా ఆ తర్వాత ఆలోచించకుండా పలు పదార్థాలను తీసుకుంటారు. అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. కానీ కొన్ని ఆహారç పదార్థాల కలయిక వల్ల శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటిలో పాలు కూడా ఉన్నాయి. చాలామంది ఉదయం వేళ పాలను తాగుతారు. అయితే.. పాలు తాగిన తర్వాత కొన్ని పదార్థాలు తింటే వివిధ రకా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆహార నిపుణులు హెచ్చరిస్తుంటారు.

 

పాలు తాగిన వెంటనే నారింజ, పైనాపిల్‌ వంటి పుల్లని పండ్లను తినకూడాదట. ఎందుకంటే క్యాల్షియం పండ్లలో ఉండే ఎంజైమ్‌లను గ్రహిస్తుంది. దీని వల్ల మీ శరీరానికి పోషకాహారం కూడా అందదు.
పాలు తాగిన వెంటనే నిమ్మరసం, లేదా నిమ్మతో చేసిన పదార్థాలను తినరాదని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. పాలు తాగిన వెంటనే నిమ్మకాయతో తయారు చేసిన ఏదైనా తింటే గ్యాస్‌ సమస్యలు వస్తాయి.

 

ఇంకా నిమ్మకాయతో చేసినవి తిన్న తర్వాత కూడా వెంటనే పాలు తాగరాదు. ముల్లంగిని కూడా పాలు తాగిన తినకూడదు. దీనివల్ల జీర్ణశక్తి, చర్మ సమస్యలు వస్తాయి. పాలు తాగే ముందు లేదా తర్వాత చేపలు తినకూడదు. చేపలు తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. పాలు తాగిన తర్వాత చేపలు తింటే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.ఒకవేళ అలాంటి పదార్థలు తినాలని ఉంటే పాలు తాగిన 2–3 గంటల తర్వాతనే తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -