Health Tips: ఇది తరచూ తింటే ఆ రోగాలతో విముక్తి!

Health Tips: గులాబీ పువ్వు డెకరేషన్‌కు, వాటర్‌ అందానికి, రేకులు స్నానానికి మాత్రమే అనుకుంటాం.. కానీ గులాబీ రేకులతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయట. అవి కూడా అందానికి సంబంధించినవి కాదు.. ఆరోగ్యానికి సంబంధించనవి. ఈరోజుల్లో అందరిలో ఎక్కువగా ఉండే జీర్ణక్రియ, బ్యాడ్‌ కొలెస్ట్రాల్, పైల్స్‌, లైంగిక సమార్థ్యం లేకపోవడం, స్కిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గులాబీ రేకులతో తయారు చేసిన జామ్‌ను గుల్కాండ్‌ అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే ఐరన్‌, ప్రోటీన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మార్కెట్లలో తేనె కలిపిన గుల్కాండ్‌ జామ్‌ లభిస్తోంది. దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

250 గులాబీ రేకులు, 250 గ్రాముల పంచదార తీసుకోవాలి. ముందుగా గులాబీ రేకులను తాజా నీటితో శుభ్రంగా కడిగి ఆవి పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టాలి. పొడి ఐన రేకులను పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పంచదార కలుపుకోవాలి. ఆ పేస్టును గాలి చేరని సీసాలో వేసి 2-3 వారాల పాటు ఎండ తగిలేలా ఉంచాలి. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి వాడుకోవచ్చు. ఈ జామ్‌ను రోజూ రెండు టీ స్పూన్లు తమలాపాకులో వేసుకుని తింటే తియ్యగా ఉంటుంది. డయాబెటీస్‌ ఉన్న వాళ్లు దీన్ని తినాలో లేదా అనేది వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

గుల్కాండ్‌లోని యాంటీ బ్యాక్టిరియల్‌ మరియు యాంటీ వైరల్‌ గుణాలు రక్తం లోని విష వ్యర్థాలను తొలగిస్తాయి. ఈ జామ్‌ గర్భిణులకు చాలా మేలు చేస్తోందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక ఈ జామ్‌ ఎసిడీటీ అజీర్తి సమస్యలను సైతం దూరం చేస్తోంది. పిల్లలు మలమద్ధకంతో బాధపడితే ఈ జామ్‌ను తినిపిస్తే ఈ సమస్య దూరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. చర్మ సమస్యలపై కూడా ఈ జామ్‌ బాగా పని చేస్తోంది. ఈ జామ్‌ను తరచూ తింటుంటే మొఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను కనిపిం‍చకుండా చేస్తాయి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -