Health Tips: ఆ వ్యాధి ఉంటేనే కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు ఆడిస్తారు!

Health Tips: ప్రతి మనిషికి ఒక్కో అలవాటు ఉండటం సహజమే.  ఎంత మంది లో  కూర్చున్న సరే వారికున్న అలవాటును మార్చుకోరు. కొందరు చేతుల వేళ్లు విరుచుకుంటే మరి కొందరు కను బొమ్మలు పైకి కిందకి ఆడిస్తుంటారు. ఇంకొందరు కాళ్లు చేతులు కదిలిస్తుంటారు.  అయితే కొందరు మాత్రం కుర్చీలో కూర్చున్న కూడా వారు దానిపై నుంచి లేచే వరకు తమ కాళ్ళను కదిలిస్తూనే ఉంటారు. అయితే అలా కదిలిస్తే సమస్య ఉండదు. కానీ.. నిద్ర పోతున్నప్పుడు కూడా కాళ్లు, చేతులు ఆడిస్తూనే ఉంటారు.  అయితే అలా పడుకున్నప్పుడు కూడా చేతులు, కాళ్లు ఆడిస్తే మాత్రం అది ఓ వ్యాధికి సంకేతమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

అయితే మరికొందరికి కూర్చున్నప్పుడు కూడా వణుకుతుంటాయి. అలా వణకడానికి కారణం రెస్ట్‌లెస్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌ అనేది ఓ కారణమే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనగా ఒక వ్యక్తి కూర్చున్న పడుకున్నా కాళ్లలో ఉన్నట్టుండి నొప్పి మొదలవుతుంది. ఈ సమయంలో కాళ్లను కాస్త కదిలించినప్పుడు ఈ నొప్పి తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ బాధాకరమైన పరిస్థితి పదేపదే సంభవించినప్పుడు, దానిని రెస్ట్ లెగ్స్ సిండ్రోమ్ అంటారు.

ఐరన్ లోపం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. ఈ అలవాటు కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల కూడా వస్తోందట. ఇంట్లో తల్లిదండ్రుల్లో ఒకరికి ఉన్నా పిల్లలలో కూడా వచ్చే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా గర్భిణులు, కిడ్నీ, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వారు డెలివరీ చివరి రోజులలో ఇలాంటి సమస్యలు సంభవిస్తాయి. రక్తపోటు, షుగర్ పేషెంట్లకు, హృద్రోగులకు దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి చికిత్సకు సాధారణంగా ఐరన్ మాత్రలు సూచిస్తారు. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్య. ఈ సమస్య పురుషులు, స్త్రీలలోనూ వస్తోంది. అలాగే ఇది నిద్రలేమి సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు. కాబట్టి కాళ్లు వణుకుతున్న అలవాటు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -