Health Tips: ఈ ఐదు రకాల ఫుడ్‌కు దూరంగా ఉంటే అనారోగ్యం దరిచేరదు.. అవేంటో తెలుసా?

Health Tips: మనం ఆరోగ్యంగా బతకాలంటే తీసుకొనే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషక విలువలున్న పదార్థాలను ఫుడ్‌ ఐటమ్స్‌గా తీసుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల త్వరగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

జంక్‌ ఫుడ్‌లో రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అనేక రసాయన సమ్మేళనాలు ఆహారంలో దాని రుచి, రంగు, ఆకర్షణీయమైన రూపాన్ని, షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి జోడిస్తారు. అటువంటి ఆహారాలు మన ఆరోగ్యంపై పూర్తిగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ క్రమంలో మనం ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

మనం దూరంగా ఉండాల్సిన వాటిలో సోడియం నైట్రేట్‌ ఒకటి. ఇది పంది మాంసం, జెర్కీతో సహా అనేక ప్రాసెస్ చేసిన మాంసాల్లో సంరక్షణకారిగా ఉపయోగిస్తారు. సోడియం నైట్రేట్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి, మాంసాల రంగు, ఉప్పగా ఉండే రుచిని సంరక్షించడానికి ప్రాసెస్ చేయబడిన మాంసం ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఈ పదార్థాలకు దూరంగా ఉండండి..
ఇంకా ఈస్ట్‌ సారం కలిగిన చీజ్‌, సోయా సాస్‌ లాంటివి తీసుకుంటే రక్తపోటు సమస్యలు వస్తాయి. చర్మ సంబంధ సమస్యలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. దీంతోపాటు వైట్‌ షుగర్‌ను తీసుకుంటే ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు మైదాతో చేసిన పదార్థాలు అంటే ఫాస్ట్‌ ఫుడ్స్‌ లాంటివి తీసుకుంటే ఊబకాయం, టైప్ 2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వ్యాప్తి చెందుతాయి. అలాగే శుద్ధి చేసిన నూనెలు, ప్రాసెస్డ్‌ నూనెలను అధికంగా తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్‌తో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -