Health Tips: చలికాలంలో చర్మం జుట్టు సంరక్షణ కోసం ఈ డ్రింక్స్ తాగాల్సిందే?

Health Tips: శీతాకాలం వచ్చింది అంటే చాలు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు, దగ్గు,జలుబు వంటి సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. వాటితో పాటుగా చాలామంది ఇబ్బంది చర్మం జుట్టు కు సంబంధించిన సమస్యలతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. చలికాలంలో వీచే చల్లని గాలులకు జుట్టు అలాగే చర్మం సమస్యలకు సంబంధించిన వాటి బారిన పడుతూ ఉంటారు. వీటి కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అవేమి ఉపయోగించుకోకుండా సహజ సిద్ధంగా దొరికే కొన్ని రకాల డ్రింక్స్ తో చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

 

ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక గాజు కూజాలో ఒక దోసకాయ, కీవీ ముక్కలు కట్‌ చేసి వేయాలి. ఆ తరువాత అందులో ఉడికించిన పుదీనా ఆకులను కలపాలి. ఆపై కూజాను నీటితో నింపి 2 గంటలు అలాగే వదిలేయాలి. ఈ డిటాక్స్‌ నీటిలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే నారింజ, స్ట్రాబెర్రీ ముక్కలను జాడీలో వేసి అందులో తాజా పుదీనా ఆకులను వేసి, నీళ్లతో కలిపి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. ఈ డిటాక్స్‌ డ్రింక్‌లో ఒక టీస్పూన్‌ తేనె మిక్స్‌ చేసి ఉదయాన్నే తాగాలి. అలా చేయడం వల్ల శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.

 

ఒక బాటిల్‌ నీటిలో గ్రీన్‌ యాపిల్‌, పుదీనా ఆకులు వేయాలి. వాటిని బాగా మిక్స్‌ చేసి గంటసేపు అలాగే ఉంచాలి. ఈ డ్రింక్‌ రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల అది మీ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. ఇందులో నల్ల ద్రాక్ష కూడా కలుపుకుంటే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. అందుకోసం ఒక లీటర్‌ నీటిలో 10 లేదా 15 గ్రేప్స్, 1 నిమ్మకాయ రసం కలపాలి. లభించే కొబ్బరి నీరు తాగడం వల్ల జుట్టు అలాగే చర్మం బాగుంటుంది. కొబ్బరినూనెలో జుట్టు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -