Health Tips: రొమ్యాన్స్ కు దూరంగా ఉంటున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గ్యారెంటీ?

Health Tips: తరచూ శృంగారంలో పాల్గొనకపోతే మానసికంగా, శారీరకంగా అనారోగ్య ప్రభావం ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అదేంటి శృంగారంలో పాల్గొనకపోతే కూడా ముప్పా అంటే.. అవునంటున్నారు వైద్య నిపుణులు. మామూలుగా పెళ్లయిన దంపతులు ఇతర కారణాల వల్ల శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు.

 

దీంతో అలాంటి వారిలో కొని అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. తరచుగా శృంగారంలో పాల్గొనకపోడం వల్ల పురుషులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. అందులో అంగస్తంభన లోపం, అకాల స్కలనాలు, హైపోయాక్టివ్ లైంగిక కోరిక, రెట్రో గ్రేడ్స్ స్కలనం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్, ప్రోస్ట్రేట్ రుగ్మతల వంటి సమస్యలను పురుషులు ఎదుర్కొంటారని తెలిసింది.

 

ఇక స్త్రీలకు యోని డ్రై అవ్వడం, సంభోగం సమయంలో నొప్పి రావడం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఋతుష్రావం సమయంలో నొప్పి రావడం, పెల్విక్ ఫ్లోర్ బలహీనతగా ఉండటం, పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ వంటి సమస్యలు ఎదుర్కొంటారని తెలిసింది. కొన్ని సందర్భాలలో పురుషులు, స్త్రీలు ఇద్దరికీ కలిపి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని అందులో ఉబకాయం, రక్తపోటు, థైరాయిడ్, నడుము సమస్యలు, అలసట వంటివి కూడా వస్తాయని తెలిసింది.

 

అయితే శృంగారంలో పాల్గొనకపోతే మాత్రం మానసిక ఇబ్బందులు ఎదురవటం ఖాయమని అంటున్నారు. శృంగారం చేసే సమయంలో అనుభూతి చెందే హార్మోన్లు విడుదలవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని తెలిసింది. అయితే దానిలో పాల్గొనకపోతే మానసిక సమస్యలతో పాటు నిరాశ కూడా ఉంటుందని తెలిసింది. పైగా నిద్ర సమస్యలు కూడా ఎదురవుతాయట. అలా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా వస్తాయని.. కాబట్టి మీ జీవిత భాగస్వామితో క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్టులకు దూరంగా ఉండవచ్చు అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -