Health tips: అలాంటి మహిళలకే ఎక్కువగా గుండెపోటు సమస్యలు?

Health tips: సాధారణంగా పెళ్లి అయిన ప్రతి ఒక స్త్రీకి పెళ్లి తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం లాంటిది. అంతేకాకుండా తల్లి కావడం అన్నది ప్రతి ఒక్క మహిళ జీవితంలో ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు తల్లులు కాలేకపోతున్నారు. ఇక ప్రెగ్నెన్సీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం కావడంతో మానసికంగా కృంగిపోతుంటారు. మరి కొంతమంది మహిళలు అయితే పిల్లలు కలగలేదు అన్న బాధతో మానసికంగా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే తాజాగా ఒక అధ్యయనం ప్రకారం వంధ్యత్వం ఉన్న మహిళలు గుండెపోటు బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది.

 

పిల్లలు ఉన్న మహిళల కంటే వంధ్యత్వం ఉన్న మహిళలకి గుండెపోటు ప్రమాదాలు వచ్చే అవకాశం 16 శాతం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంతేకాకుండా గర్భధారణ సమయంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తాజా నివేదికలో వెళ్లడైందని పరిశోధకులు తెలిపారు. అయితే గుండె వైఫల్యంలో ఒకటి రక్తాన్ని పంప్ చేసిన తర్వాత గుండె కండరాలు పూర్తిగా విస్తరించలేవు. అటువంటి సమయంలో గుండె పోటు వస్తూ ఉంటుంది. గర్బధారణ సమస్యలు ఉన్న మహిళలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 

కాబట్టి అటువంటి మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇకపోతే వంధ్యత్వం అంటే ఏమిటీ అన్న విషయానికి వస్తే.. ఏదైనా కారణం చేతనో లేకపోతే ఏదైనా లోపం వల్లో గర్బం ధరించపోతే దాన్ని వంధ్యత్వం అంటారు. వంధ్యత్వానికి కారణం.. స్త్రీల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వంధ్యత్వానికి దారి తీస్తుంది. శరీరంలో సాధారణ హార్మోన్లలో మార్పులు లేనప్పుడు అండాశయాల నుంచి ఎగ్స్ రిలీజ్ కావు. దీనికి కారణం ఒత్తిడి, వయసు, ఆధునిక జీవన శైలి మొదలైనవి. ఈ వంధ్యత్వం లక్షనాల విషయానికి వస్తే.. మహిళ రుతుచక్రం 35 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే అది వంధ్యత్వం లక్షణం అని చెప్పవచ్చు. లేదంటే 21 రోజుల కంటె ముందే రుతుస్రావం ప్రారంభం కావడాన్ని అపక్రమ రుతుస్రావం అంటారు. ఇది కూడా వంధ్యత్వానికి దారితీస్తుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -