Health Tips: సీమ చింతకాయ తింటే అది ఇంకా పెరుగుతుంది!

Health Tips: చింతకాయ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు దీన్ని వివిధ రకాల కూరల్లో వేసి వండుతారు. పప్పులో చింతకాయ లేదా చింతపండు కచ్చితంగా వేయాల్సిందే. అయితే సీమ చింతకాయ అనేది చాలా మందికి తెలిసి ఉండదు. గులాబీ, ఎరుపు రంగులో ఉండే ఈ సీమ చింతకాయలు కాస్త తియ్యగా కొద్దిగా వగురుగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి మాత్రం వీటి గురించి చాలానే తెలిసి ఉంటుంది. ఈ చింతకాయ దక్షిణ అమెరికా, దక్షిణ మెక్సికో, మధ్య అమెరికా సంతతికి చెందింది. దీన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచడానికి ఈ చింతకాయ ఎంతో దోహదపడుతుంది.

 

 

వీటిలో అధిక మోతాదులో పోషకాలు ఉంటాయి. విటమిన్‌ ఏ, బీ, సీ, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇలా అనేక పోషకాలు ఇందులో మెండుగా లభిస్తాయి.
సీమ చింతకాయలు పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి మరియు నోటి పూతలని నిర్వహించడానికి తోడ్పడతాయి. అలాగే యాంటీసెప్టిక్‌ గా కూడా పనిచేస్తాయి. సీమ చింతకాయలను తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచుతుంది. మధుమేహం వ్యాధి గ్రస్తులు ప్రతి రోజు తగిన మోతాదులో సీమ చింతకాయలు తీసుకుంటే రక్తంలో షుగర్‌ లెవల్‌ కంట్రోల్‌లో ఉంటాయి.

 

అతి ఆకలి తగ్గు ముఖం పట్టడంతో త్వరగానే బరువు తగ్గెందుకు ఆస్కారం కూడా ఉంటుంది. డయేరియా సమస్యతో బాధపడే వాళ్లకు కూడా సీమ చింతకాయ బాగా ఉపయోగపడుతుంది. ïసీమ చింతకాయ కొమ్మను తీసుకుని మరిగించి ఆ నీళ్లని తరచూ తాగితే డయేరియా సమస్య తగ్గిపోతుంది. సీమ చింతకాయ జిడ్డుగల మాడుకు చికిత్స చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాక వృద్ధాప్యాన్ని కూడా దూరం చేçయడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నల్లటి మచ్చలను తొలగిస్తుంది. మొటిమలు రాకుండా కాపాడుతుంది.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -