Health Tips: వాటిని అలా వాడితే తెల్ల జుట్టు సమస్య మటుమాయం!

Health Tips: ఒకప్పుడు ఐదు పదుల దాటితేనే తెల్లజుట్టు వచ్చేది. నేటి కాలంలో చిన్నారులకు సైతం తెల్లజుట్టు వస్తుందంటే నమ్మక తప్పడం లేదు.పని ఒత్తిడి, హార్మోన్ల విడుదలలో తలెత్తే సమస్యలు, వాతావరణ కాలుష్యం, తదితర కారణాలతో జుట్టు తెల్లగా మారుతోంది. అయితే తెల్లజుట్టును నల్లగా చేసే క్రమంలో చాలా మంది అనేక రకాల చికిత్సలు, ఔషధాలను వాటి ఉన్న జుట్టను పోగొట్టుకుని ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండానే తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉసరిలోని అమైనో యాసిడ్స్‌ జుట్టును అన్ని సమస్యల నుంచి కాపాడుతోందని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఉసిరికాయల రసానికి సమానంగా నిమ్మరసం కలిపి తలకు పట్టించి గంట తర్వాత నీటితో లేదా షాంపూతో తలస్నానం చేస్తే జుట్టుతో పాటు కుదుళ్లకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఉసిరికాయల రంసలో నాలుగు కుంకుడు కాయలు, నాలుగు శీకాకాయలు రెండు గంటల పాటు నానాబెట్టి ఆ రసాన్ని తలకు రాసి 5 నిమిషాల మసాజ్‌చేసి నీటితో కడిగితే తెల్లజుట్టుతో పాటు వెండ్రుకలు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. ఉసిరికాయల బదులు ఉసిరిపొడి కూడా వాడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మూడు ఉసిరికాయలను ముక్కలుగా చేసి మిక్సిజార్‌లో వేసి దాదాపుగా 20 కరివేపాకులు,∙రెండు టీ స్పూన్ల నీరు పోసి పేస్ట్‌ల చేసి తలకు బాగా అప్లయ్‌ చేయాలి. రెండు గంటల తర్వాత బాగా నీటితో కడిగి ఆరబెట్టాలి ఇలా చేస్తే జుట్టు బలంగా ఉండటంతో పాటు షైనింగ్‌ కూడా వస్తోంది.

 

మూడు టీస్ఫూన్ల ఉసిరిపొడికి 3 టీ çస్పూన్ల పెరుగు 2 టీ çస్పూన్ల తేనె కొన్ని నీళ్లు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. అరగంట తర్వాత గొరువెచ్చని నీటితో తలంటూ స్నానం చేస్తే జుట్టుబలంగా ఒత్తుగా పెరగడం ప్రారంభం అవుతోంది. 4 మందార పువ్వులు, 3 మందార ఆకులను పేస్టుగా చేసి 3 టీ స్పూన్ల కొబ్బరి నూనె, 1 టీ స్పూన్‌ ఉసిరిపొడి కలిసి తలకు రాసుకుని మసాజ్‌ చేయాలి. గంట తర్వాత షాంపులతో స్నానం చేస్తే సత్ఫాలితాలు ఉంటాయిని నిపుణులు పేర్కొంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -