Healthy Tips: అరిటాకులో భోజనం చేస్తే అటువంటి సమస్యలకు చెక్?

Healthy Tips:ఇంతకుముందు మన పూర్వీకులు ఎక్కువగా ఐటాకుల్లో భోజనం చేసేవారు. కానీ టెక్నాలజీ డెవలప్ అవడంతో స్టీల్, గాజు ప్లేట్ లలో భోజనం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని కొన్ని రాష్ట్రాలలో కొన్ని పల్లెటూర్లలో అలాగే కొన్ని వివాహాది కార్యక్రమాలలో విస్తరాకులలో అలాగే అరిటాకులలో భోజనం వడ్డిస్తూ ఉంటారు. చాలావరకు దక్షిణ భారతీయులు ఈ సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అయితే అరిటాకులో భోజనం చేయడం అన్నది చాలామంది పద్ధతిగా భావిస్తూ ఉంటారు. ఈ పద్ధతి మాత్రమే కాదండోయ్ ఆరోగ్యానికి కూడా సూత్రం. అదిలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే అరటిపాకులో భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 

అరటి ఆకులో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్‌లు ఉండటం కారణంగా ఆకు పై భోజనం చేయడం వల్ల అందులోని పాలీఫెనాల్స్‌ శరీరంలోకి వెళ్లి కడుపులో ఉన్న వ్యర్ధాలను తొలగించడంలో ఎంతో బాగా పని చేస్తుంది. అరిటాకుల్లో ఉండే పాలీఫెనాల్స్ రోగ నిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. దాంతో వ్యాధులపై పోరాడే శక్తి బలపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో పాలీ ఫెనాల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అరిటాకులో ఆహారాన్ని ఉంచినప్పుడు పాలీఫెనాల్స్ ను గ్రహిస్తాయని, అవి మన శరీరంలోకి చేరి మేలు చేస్తాయి. అరిటాకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అవి సూక్ష్మ క్రిములను ఇవి చంపేస్తాయి. అయితే మనం ప్రతిరోజు ఉపయోగించే పాత్రలను కడిగిన అందులో బ్యాక్టీరియా ఉండే అవకాశం లేకపోలేదు కాబట్టి అరిటాకులలో భోజనం చేస్తే ఎటువంటి సమస్య ఉండదు.

 

అయితే అరిటాకులను విందు భోజనాల్లో ఉపయోగించడం వల్ల వ్యర్థాల సమస్య ఉండదు. దక్షిణ భారతీయులు అరిటాకులో ఎక్కువగా అరటి ఆకుల్లోనే భోజనం చేసే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా వారాంతపు రోజులు, పెళ్లిళ్లు, ఆలయాల్లో అరటి ఆకుల్లోనే అన్నదానం, ప్రసాద వితరణ చేస్తుంటారు. అదే విధంగా దక్షిణాంధ్ర ప్రాంతంలోని హోటళ్లలో అరిటాకు వినియోగించడాన్ని చూడొచ్చు. అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్న ఆచారం కూడా. అంతేకాకుండా వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తి పెంచుతుంది. ఈ ఆకులో అన్ని రకాల విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులలో ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -