Healthy Tips: ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదంటే ఈ తప్పులు చేస్తున్నట్టే?

Healthy Tips: మనిషికి నిద్ర అన్నది చాలా అవసరం. కంటినిండా సరైన నిద్ర లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కొంతమందికి నిద్ర దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పవచ్చు. పడుకోగానే వెంటనే గురకలు పెట్టి మరి నిద్రపోతూ ఉంటారు. కానీ ఇంకొందరు మాత్రం వారికున్న ఆలోచనలు పని ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు కారణంగా పడుకోవాలి అంటే ఒక చిన్నపాటి యుద్ధం చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మనం చేసే కొన్ని రకాల తప్పులు వల్ల కూడా నిద్రకు ఆటంకం కలగవచ్చు. మరి మనం చేసే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యలకు నిద్ర పట్టకపోవడానికి కారణం అని చెప్పవచ్చు.

 

అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిద్రపోవాలి అని ట్రై చేసినప్పటికీ నిద్ర సరిగా పట్టదు. అటువంటప్పుడు ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవాలి. దాంతో శరీరానికి విశ్రాంతి దొరికి ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. నిద్ర రాకపోవడానికి బెడ్ రూమ్ వాతావరణం కూడా ఒక రకంగా కారణమని చెప్పవచ్చు. కాబట్టి బెడ్రూమ్ ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండే విధంగా చూసుకోవాలి. బెడ్రూంలో ఎప్పుడూ టీవీ సౌండ్ సిస్టం ఉండకుండా చూసుకోవాలి. ఇవి ఎక్కువగా నిద్రకు భంగం కలిగిస్తాయి. అలాగే బెడ్రూంలో గోడలకు వేసే రంగు జాగ్రత్తగా వహించాలి. బెడ్రూంలో ఎప్పుడూ కూడా గోడలకు లేత రంగులు ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా సౌండ్ సిస్టం ఉన్నప్పటికీ మనకు నచ్చిన సాంగ్స్ మనసుకు ఆహ్లాదకరమైన సాంగ్స్ ను సౌండ్ తక్కువ పెట్టుకుని వింటూ ఉండటం వల్ల ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలు తగ్గి నిద్ర బాగా పడుతుంది.

 

నిద్రపోవడానికి ముందు టీ కాఫీ వంటివి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే కెఫిన్ అనే పదార్థం శరీరాన్ని ఉత్సాహంగా ఉంచి నిద్ర రాకుండా చేస్తుంది. రాత్రి సమయంలో నిద్ర పట్టదు అనుకున్న వారు గోరువెచ్చనీ నీటితో స్నానం చేయడం వల్ల అలసట తగ్గి శరీరం తేలికబడి నిద్ర బాగా వస్తుంది. అలాగే రాత్రి సమయంలో నిద్ర పట్టదు అనుకున్న వారు గోరువెచ్చని పాలను తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. చాలామంది పగటిపూట ఎక్కువసేపు నిద్రపోయి రాత్రి సమయంలో మేలుకొంటూ ఉంటారు. ఇలా చేయడం అసలు మంచిది కాదు. కాబట్టి పగటి సమయంలో నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నించి రాత్రి సమయంలో తొందరగా పడుకోవడానికి ప్రయత్నించాలి. మనం భోజనం చేసే సమయం కూడా నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణం కావచ్చు. ఎప్పుడైనా సరే రాత్రి సమయంలో పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనాన్ని తినే అలవాటు చేసుకోవాలి. తిన్న వెంటనే నిద్ర పోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలా చేయడం వల్ల నిద్ర పట్టకం పోవడం మాత్రమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -