RGV: దర్శకుడు ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన వర్మ ఇప్పుడు సరైన అవకాశాలు లేక ఇలా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు గురించి తరచూ సంచలన వ్యాఖ్యాలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

తాజాగా మరొకసారి రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యాలు వైరల్ గా మారాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ గురించి ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏఆర్ రెహమాన్ దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఏ ఆర్ రెహమాన్ ప్రస్తుతం వరుస సినిమాలకు సంగీతం అందించలేదు. గతంలో రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

 

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ రెహమాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో ఆర్జీవీ మాట్లాడుతూ…” దేవుడిని నమ్మకపోతే ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చని వర్మ అన్నారు.నాకు పాపాలు చేయడం ఇష్టం కాబట్టి దేవుడిని నమ్మనని ఆయన తెలిపారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ అమెరికాకు వెళ్లాలని కోరుకుంటారు. కాబట్టి అమెరికన్లు నమ్మే దేవుడు తన దృష్టిలో చాలా గ్రేట్ అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.

 

ఇక ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ కూడా మతం మార్చుకున్న తర్వాతే గొప్పవాడు అయ్యాడని తెలిపాడు. అతని అసలు పేరు దిలీప్ కుమార్ అని సాయిబాబా బాలాజీ టెంపుల్ కు వెళ్లే అతను ఆ తర్వాత మతం మారాడని మతం మారిన వెంటనే సూపర్ హిట్ అయ్యాడని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మన దేశంలో హిందువులు మాత్రమే మతం మారతారు కానీ ముస్లింలు, క్రిస్టియన్లు ఎప్పుడూ మతం మార్చలేదని ఆయన తెలిపారు. ఏఆర్ రెహమాన్ గురించి ఆర్జీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -