Tollywood: ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్ మాటలు వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో డిఎస్ రావు అలియాస్ దమ్మలపాటి శ్రీనివాస్ రావు ఒకరు ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. అయితే నిర్మాతగా ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డిఎస్ రావు తన సినీ జర్నీ గురించి పలు విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా డిఎస్ రావు మాట్లాడుతూ సినిమాలపై ఉన్న ఆసక్తితో తాను విదేశాల నుంచి ఇండియాకు తిరిగివచ్చి నిర్మాతగా స్థిరపడ్డానని తెలిపారు. అయితే తాను నిర్మాతగా మారడం కన్నా ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో కొనసాగుతూ ఉండేవారని తెలిపారు. ఇక తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పిల్ల జమిందార్, ద్రోణ, మిస్టర్ నూకయ్య,చమ్మక్ చల్లో వంటి సినిమాలను నిర్మించారు. అయితే ఇవన్నీ కూడా చిన్న సినిమాలు కావడంతో ఈయన తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్నారని తెలియజేశారు.

 

ఇక మాట్లాడుతూ తనకు ఇద్దరు కుమారులని తన కుమారులు ఎప్పుడు కూడా మీరు పెద్ద హీరోలతో ఎందుకు సినిమాలు చేయలేదు. కనీసం మీరు చేసిన సినిమాల గురించి కూడా చెప్పుకోవడానికి వీలు కావడం లేదు అంటూ తనని ప్రశ్నిస్తారని ఈయన తెలియజేశారు ఇక తన పెద్ద కుమారుడు చూడటానికి చాలా బాగుంటాడని,హీరోల కన్నా తన కుమారుడు చాలా అందంగా ఉంటారని ఈయన తెలియజేశారు అయితే తనని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని తాను ప్రయత్నించిన తన కుమారుడికి సినిమాలు అంటే ఆసక్తి లేకపోవడం వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలిపారు.

 

ఇక తన రెండో అబ్బాయికి ప్రస్తుతం 14 సంవత్సరాలని తాను ఉన్నత చదువులు చదువుతున్నారు అని తెలిపారు. అయితే తనకు సినిమాలపై మంచి ఆసక్తి ఉంది.ఇక తానైనా ఇండస్ట్రీలోకి హీరోగా వస్తారో లేదో వేచి చూడాలి అంటూ ఈ సందర్భంగా డిఎస్ రావు తన కుమారుల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయంలో తాను పిల్ల జమిందార్ వంటి మంచి సక్సెస్ అందుకున్న తర్వాత స్టార్ హీరోలతో సినిమా చేసి ఉంటే నిర్మాతగా సక్సెస్ అయ్యే వాడినని తాను చిన్న హీరోలతో సినిమా చేయటం వల్లే నష్టపోయానని ఈయన తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ ఆ విషయంలో భయపడుతున్నారా.. అలా జరుగుతోందా?

CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన విధానం, ఆయన మాటలు వైసిపి మంత్రులకు ఎమ్మెల్యేలకు అంతు చిక్కడం లేదు. జగన్ ఆలోచన విధానాలను అంచనా వేయలేకపోతున్నారు. ఇకపోతే గత...
- Advertisement -
- Advertisement -