Covid-19: కరోనా వ్యాక్సిన్‌తో ఆ సమస్య వెంటాడుతోంది!

Covid-19: మూడేళ్ల క్రితం చైనా ల్యాబ్‌లో నుంచి విడుదలైన వైరస్‌ ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. కరోనా వ్యాప్తితో దనిక, బీద తేడా లేకుండా ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. కరోనా దెబ్బతో అన్ని రంగాలు మూతపడ్డాయి. దీంతో చేసేందుకు ఉద్యోగాలు, పనులు లేకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. కొన్ని నెలల తర్వాత కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. ప్రారంభంలోనూ వ్యాక్సిన్‌పై అపోహాలు రావడంతో చాలా మంది టీకా తీసుకునేందకు వెనకాడారు. ఆ తర్వాత ప్రభుత్వం వివిధ రకాలుగా అవగాహన కల్పించిన తర్వాత వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఆసక్తి కనబరిచార. కరోనా మహమ్మరి తగ్గుముఖం పడుతున్న క్రమంలో చాలా మంది రెండవ డోస్‌ తీసుకోలేదు.

అంతర్జాతీయ ఆరోగ్య జర్నల్‌లో పబ్లిష్‌ అయిన ఇటీవలి స్టడీ ఫలితాల్లో ఇలా ఉంది. సుదీర్ఘ కొవిడ్‌’ అన్‌మాస్క్‌›్డ క్లినికల్‌ ఫీచర్లు కోవిడ్‌ –19 రోగులలో çహృదయ సంబంధ సమస్యలను సూచిస్తున్నాయని తెలిపింది. కొవిడ్‌ మహమ్మారి సోకిన వారు లేదంటే కొవిడ్‌ డోసులు తీసుకున్న వారిలో పక్షవాతం, గుండె జబ్బులు పెరుగుతుండటం ఆరోగ్య నిపుణులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ‘కొవిడ్‌–19 కారణంగా సంభవించే ఇంకా చాలా తెలియని లక్షణాలు, సీక్వెల్‌లు వైద్యులకు అంతుపట్టడం లేదు. గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం, పొడవాటి ఎముకలు, కీళ్లు ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే నాళాలలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు కనబరిచింది. కోవిడ్‌ పలు దశలలోని రోగుల్లో ఇవే సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్‌లకు కారణమయ్యే రక్తం గడ్డకట్టే అనేక కేసులతో, కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రతి అదనపు మోతాదుతో ప్రమాదావకాశాలు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో మెసెంజెర్‌ రిబో న్యూక్లిక్‌ (ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ) రకం వ్యాక్సిన్‌తో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయని అమెరికాలోని ఫ్లోరిడా సర్జన్‌ జనరల్‌ జోసెఫ్‌ వెల్లడించారు. అయితే 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు ఉన్న పురుషుల్లో ఎక్కువ రిస్క్‌ ఉందని వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న 28–30 రోజుల్లో గుండెపోటుతో మరణాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి మరో అనుమానం వెంటాడుతోంది. అయితే అన్ని వ్యాక్సిన్‌లు అలా ఉండవని , దీంతో వ్యాక్సిన్‌ తీసుకున్నవారు సైతం భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -