BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. మహిళా క్రికెటర్లకు వేతనాలు పెంపు.. జీతాలెంతో తెలుసా?

BCCI: భారత క్రికెట్ నియంత్ర బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పురుషులకు ధీటుగా ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెటర్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు సైతం సమాన వేతనాన్ని అందించనుంది. అయితే చాలాకాలంగా క్రీడారంగంలో మహిళలపై విక్షత కొనసాగుతూ వస్తోంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లను గుర్తించలేకపోయే వారు. కానీ ఇప్పుడా ధోరణి మారిందనే చెప్పవచ్చు. పురష క్రికెటర్లకు ధీటుగా మహిళా క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానం వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది.

మహిళలపై ఉన్న వివక్షను తొలగించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అలాగే పే ఈక్విటీని కూడా అమలు చేస్తామన్నారు. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచులకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచులకు రూ.3 లక్షలు చెల్లించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం సెంట్రల్ కాంటాక్ట్ కలిగిన పురుష క్రికెటర్ల మ్యాచ్ ఫీజు.. ఏ ప్లస్ కేటగిరీ క్రికెటర్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఏ కేటగిరీ ప్లేయర్‌కు రూ.5 కోట్లు, బీ కేటగిరీ ప్లేయర్‌కు రూ.3 కోట్లు, సీ కేటగిరీ ప్లేయర్‌కు రూ.కోటి చెల్లిస్తున్నారు. వీరిలో మహిళ క్రికెటర్లకు కేవలం 10 శాతం మాత్రమే ఫీజు చెల్లించేవారు. ఏ గ్రేడ్ ప్లేయర్లకు రూ.50 లక్షలు, బీ గ్రేడ్ ప్లేయర్లకు రూ.30 లక్షలు, సీ గ్రేడ్ ప్లేయర్లకు రూ.10 లక్షలు మాత్రమే చెల్లించేవారు.

కాగా, బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పురుషులు, మహిళలు అనే వివక్షను అధిగమించేందుకు బీసీసీఐ మొదటి అడుగు వేయడం సంతోషకరంగా ఉంది. మేము మా కాంట్రాక్ట్ మహిళా క్రికెటర్ల వేతన ఈక్విటీ విధానాన్ని అమలు చేస్తున్నాము. ఇకపై పురుషులు, మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజు ఒకే విధంగా ఉంటుంది.’ అని పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -