Mega Heroes: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు మెగా ఫ్యామిలీ హవా నడుస్తుంది. మెగా ఫ్యామిలీ లో నుంచి వచ్చిన హీరోలు ప్రస్తుతం స్టార్ హీరో స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్లుగా వెలుగుతున్నారు. తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఒక ఒక రేంజ్ లో విజయం సాధిస్తున్నారు. ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీ హీరోలు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్: ఇటీవలే భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తన క్యారెక్టర్ ను అదరగొట్టాడు. ఈ సినిమా 450 యొక్క కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
సైరా నరసింహారెడ్డి: చిరంజీవి, నయనతార, తమన్నా ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరు నటన మరో స్థాయిలో ఉందని చెప్పవచ్చు. కాగా ఈ సినిమా 187.25 కోట్లు కొల్లగొట్టింది.
ఆచార్య: రామ్ చరణ్, చిరంజీవి తండ్రి కొడుకులు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా స్టోరీ పరంగా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. కానీ 131. 20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
పుష్ప: దర్శకుడు సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో ప్రాణం పోసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బన్నీ తన చిత్తూరు యాసతో ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకున్నాడు. 144.9 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
అజ్ఞాతవాసి: భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా స్టోరీ పరంగా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. కానీ 123.6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకుంది.