Star Heroines: ఒకప్పుడు ఐరన్ లెగ్ ఇమేజ్ తో బాధ పడిన స్టార్ హీరోయిన్లు ఎవరంటే?

Star Heroines: టాలీవుడ్ లో మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మంది ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్ లతో విసుగు చెందినవారే. అయితే కొందరు అన్ లక్కీ హీరోయిన్లు మాత్రం కెరీర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ పేరు తెచ్చుకుని ఆ తర్వాత ఇండస్ట్రీనే ఊపు ఊపే స్థాయికి ఎదిగారు. ఇక వారితో సినిమా అంటేనే బయపడిన హీరో, హీరోయిన్లు తర్వాత రోజుల్లో వారి కాల్షీట్ల కోసం క్యూ కట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి కొందరు హీరోయిన్ల గురించిన వివరాలు మీకోసం..

టాలీవుడ్ ని షేక్ చేసిన హీరోయిన్ అలనాటి తార రమ్యకృష్ణ. రమ్యకృష్ణ కోసం హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు లైన్లు కట్టేవారు. రమ్యకృష్ణ ఉందంటే ఇక సినిమా సగం హిట్టే. అంత పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తన కెరీర్ తొలినాళ్లలో చాలానే ఇబ్బంది పడింది. బావ మరుదల సవాల్, చక్రవర్తి, సంకీర్తన వంటి సినిమాలతో తడబడింది. ఆ తర్వాత చిన్న హీరోల నుండి బడా స్టార్లతో దాకా ఎన్నో సినిమాలు చేసి హిట్లు కొట్టిన విషయం తెలిసిందే.. ఇటీవల కూడా సోగ్గాడే చిన్ని నాయన, బాహుబలి వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

1991 లో ప్రేమ తపస్సు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రోజా సెల్వమణి.. మంచి బంపర్ హిట్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇక స్టార్ హీరోలతో స్క్రీన్ పంచుకుని ప్రేక్షకులను మెప్పించింది. కానీ సినీ కెరీర్ చివరిలో మాత్రం ఐరన్ లెగ్ పేరు మూటగట్టుకుంది. శంభో శివ శంభో, గోలీమార్ వంటి చిత్రాలతో యావరేజ్ టాక్ తెచ్చుకుంది రోజా. ఆ తర్వాత సినిమాలు ఆపేసి.. రాజకీయాల్లో హిట్స్ కొడుతోంది.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ రాణిగా పేరు గాంచిన అందాలభామ పూజ హెగ్డే.. “ముకుంద” మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన నటన, అందాల ఆరబోతతో మంచి పేరే తెచ్చుకున్నా సినిమా ఫలితాల విషయంలో ఐరన్ లెగ్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత మాత్రం అందరు అగ్ర హీరోలతో మంచి సినిమాలు చేసి, టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అందించింది. ఇక ఈ రోజుల్లో భారీ హిట్స్ తీసి, ప్రేక్షకుల మనసు గెలిచేసిందీ బుట్టబొమ్మ.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -