Tollywood: పిల్లికి కూడా బిచ్చం పెట్టని టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే?

Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు, డైరెక్టర్లు తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకున్నారు. అయితే చాలామంది కేవలం సినిమాల్లో సంపాదించడమే కాకుండా, దానిని మంచి పనుల కోసం వాడుతూ ఉంటారు. మహేష్ బాబు అయితే చిన్న పిల్లల ఆపరేషన్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లాంటివి మనం తరుచూ చూస్తూనే ఉంటాం.

కానీ కొంతమంది మాత్రం డబ్బులను కూడబెట్టడం తప్పితే, ఒక్క రూపాయి కూడా దానంగా కానీ మంచి పనులకు కానీ వాడకుండా ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరున్న చాలామంది ఈ జాబితాలో ఉన్నారు. తెలుగు సినీ చరిత్రలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది పిల్లికి కూడా బిచ్చం పెట్టని విధంగా ఉన్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆ స్టార్ హీరో గురించి చెప్పకుండా ఉండలేం. కేవలం సినిమాలే కాదు, రాజకీయాలు కూడా చేసిన నాటి స్టార్ హీరో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా దానం చేయలేదట. పైగా మంచి పనులకు తన జేబులో నుండి రూపాయి కూడా విదల్చలేదట.

తెలుగులోని టాప్ కమెడియన్ గా ఉన్న ఒక స్టార్ కమెడియన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడట. ఎంతో .పేరున్న ఆ స్టార్ కమెడియన్ మంచి పనుల కోసం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట. అలాగే స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు తెలుగులోనే కాదు, ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఎంతో పేరున్న సదరు డైరెక్టర్ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా దానం చేయడట. తన సినిమాలను కమర్షియల్ హిట్ చేసుకునే సదరు స్టార్ డైరెక్టర్ ఇప్పటి వరకు ఒక్క మంచి పనికి దానం చేసిన దాఖలు లేవట.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -